Telugu Global
Cinema & Entertainment

ఐదేళ్ల తర్వాత ర్యాంప్ వాక్

ఐదేళ్ల తర్వాత ఐశ్వర్యరాయ్ ముఖానికి రంగేసుకొని సినిమా చేస్తోందనే విషయం పాత న్యూస్. ఆమె నటిస్తున్నజాజ్బా సినిమా త్వరలోనే విడుదలకాబోతుందనేది కూడా పాత విషయం. ఐదేళ్ల తర్వాత ఆమె మళ్లీ క్యాట్ వాక్ చేసిందనేది నయా న్యూస్. అవును.. మదర్ హుడ్ తర్వాత స్లిమ్ గా మారిన ఐష్, ర్యాంప్ ను వేడెక్కించింది. అద్భుతమైన ఔట్ ఫిట్ తో క్యాట్ వాక్ చేసి అందర్నీ తనవైపు తిప్పుకుంది. తనలో గ్లామర్, టాలెంట్ చెక్కుచెదరలేదని నిరూపించుకుంది. ప్రముఖ కాస్ట్యూమ్ […]

ఐదేళ్ల తర్వాత ర్యాంప్ వాక్
X
ఐదేళ్ల తర్వాత ఐశ్వర్యరాయ్ ముఖానికి రంగేసుకొని సినిమా చేస్తోందనే విషయం పాత న్యూస్. ఆమె నటిస్తున్నజాజ్బా సినిమా త్వరలోనే విడుదలకాబోతుందనేది కూడా పాత విషయం. ఐదేళ్ల తర్వాత ఆమె మళ్లీ క్యాట్ వాక్ చేసిందనేది నయా న్యూస్. అవును.. మదర్ హుడ్ తర్వాత స్లిమ్ గా మారిన ఐష్, ర్యాంప్ ను వేడెక్కించింది. అద్భుతమైన ఔట్ ఫిట్ తో క్యాట్ వాక్ చేసి అందర్నీ తనవైపు తిప్పుకుంది. తనలో గ్లామర్, టాలెంట్ చెక్కుచెదరలేదని నిరూపించుకుంది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ ఈవెంట్ ఏర్పాటుచేశారు. మనీష్ ఇండస్ట్రీకొచ్చి పాతికేళ్లయిన సందర్భంగా కొన్ని స్పెషల్ కలెక్షన్లు సిద్ధంచేశాడు. వాటితో ఫ్యాషన్ పరేడ్ ఏర్పాటుచేశాడు. ఈ ఫ్యాషన్ షోలో షో-స్టాపర్ గా నిలిచింది ఐశ్వర్యరాయ్. మనీష్ తో ఉన్న అనుబంధంతో ఇలా క్యాట్ వాక్ చేసేందుకు ఒప్పుకుంది. వైరల్ ఫీవర్ వేధిస్తున్నప్పటికీ.. మనీష్ కోసం ఇలా రోజంతా కష్టపడి డ్రెస్-మేకప్ వేసుకొని క్యాట్ వాక్ చేసింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఐష్ మళ్లీ ఇలా స్లిమ్ గా ర్యాంప్ పై కనిపించేసరికి బాలీవుడ్ జనాలు ఆశ్చర్యపోయారు. తన సినిమా విడుదలకు ముందు ఐష్ చేసిన ఈ ఈవెంట్, జాజ్బా ప్రమోషన్ కు బ్రహ్మాండంగా కలిసొస్తుందని భావిస్తున్నారు.
First Published:  4 Aug 2015 12:33 AM IST
Next Story