Telugu Global
Others

రూ.20లకే తెలంగాణలో ఉల్లి విక్రయం

బహిరంగ మార్కెట్లో ఉల్లిగడ్డల ధరలు ఆకాశానికి ఎగ పాకుతుండడంతో తెలంగాణ సర్కార్ వినియోగ దారుల ఊరట కలిగించేందు కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కిలో ఉల్లి గడ్డలు రూ 20 లకే ఈ కేంద్రాల్లో విక్రయించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో మొదట 40 ఉల్లి గడ్డల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అట్లాగే ఇతర జిల్లాలలో కూడా జిల్లాకు 40 కేంద్రాల చొప్పున ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారుల సమావేశంలో […]

బహిరంగ మార్కెట్లో ఉల్లిగడ్డల ధరలు ఆకాశానికి ఎగ పాకుతుండడంతో తెలంగాణ సర్కార్ వినియోగ దారుల ఊరట కలిగించేందు కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కిలో ఉల్లి గడ్డలు రూ 20 లకే ఈ కేంద్రాల్లో విక్రయించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో మొదట 40 ఉల్లి గడ్డల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అట్లాగే ఇతర జిల్లాలలో కూడా జిల్లాకు 40 కేంద్రాల చొప్పున ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారుల సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం కిలో ఉల్లి మార్కెట్ లో రూ. 40 నుండి రూ. 50 వరకు విక్రయిస్తున్నారు. పేదలపై ఉల్లి గడ్డల భారం ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసే కేంద్రాలతో కొంత మేరకు భారం తగ్గనుంది.
First Published:  2 Aug 2015 6:43 PM IST
Next Story