ధనిక రాష్ర్టానికి అప్పు పుట్టలేదు
తెలంగాణ ధనిక రాష్ర్టం. సీఎం నుంచి పీఎం వరకూ ఇదే మాట. అయితే వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని ఒక్కో ఉదంతం స్పష్టం చేస్తోంది. ధనిక రాష్ర్టమైన తెలంగాణకు అప్పు ఇచ్చేందుకు కూడా రుణ సంస్థలు వెనుకాడుతున్నాయంటే..పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ విద్యుత్ సంస్థల రుణాల కోసం చేసుకుంటున్నదరఖాస్తులకు బ్యాంకర్లు కొర్రీలు వేస్తున్నారు. కరెంట్ కోతలు లేని రాష్ర్టంగా తీర్చిదిద్దితే పరిశ్రమలు వస్తాయని ఆలోచనతో థర్మల్ విద్యుత్‌కేంద్రాల నిర్మాణాలకు పూనుకుంది ప్రభుత్వం. […]
BY sarvi3 Aug 2015 1:23 AM GMT
X
sarvi Updated On: 3 Aug 2015 1:25 AM GMT
తెలంగాణ ధనిక రాష్ర్టం. సీఎం నుంచి పీఎం వరకూ ఇదే మాట. అయితే వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని ఒక్కో ఉదంతం స్పష్టం చేస్తోంది. ధనిక రాష్ర్టమైన తెలంగాణకు అప్పు ఇచ్చేందుకు కూడా రుణ సంస్థలు వెనుకాడుతున్నాయంటే..పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ విద్యుత్ సంస్థల రుణాల కోసం చేసుకుంటున్నదరఖాస్తులకు బ్యాంకర్లు కొర్రీలు వేస్తున్నారు. కరెంట్ కోతలు లేని రాష్ర్టంగా తీర్చిదిద్దితే పరిశ్రమలు వస్తాయని ఆలోచనతో థర్మల్ విద్యుత్‌కేంద్రాల నిర్మాణాలకు పూనుకుంది ప్రభుత్వం. అయితే విద్యుత్ సంస్థలకు అప్పు పుట్టకపోవడంతో థర్మల్ కేంద్రాల నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 16వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్ధ్యంతో కొత్తగా థర్మల్ ప్రాజెక్టులకు తెలంగాణ సర్కారు రూపకల్పన చేసింది. ఆర్థిక సంస్థలు మొఖం చాటేస్తుండడంతో వీటి నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది.
ఆర్థిక పరిస్థితి అధ్వానం?
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టాన్ని మిగులు బడ్జెట్ ఊరించింది. వనరులు, అభివృద్ధితో ధనిక రాష్ర్టంగా ప్రచారం జరిగింది. అయితే వాస్తవ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని తెలంగాణ ఆర్ధికరంగ నిపుణులు అంచనా. ఒక్క విద్యుత్ రంగాన్ని ఉదాహరణగా తీసుకుంటే… ఏ ఒక్క బ్యాంకూ అప్పు ఇచ్చే పరిస్థితి లేదు. మంజూరు చేసిన రుణాలూ అందలేదు.
కరెంట్ కు షాక్
రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ రంగంలో తెలంగాణ ఆస్తులు, అప్పులు ఇంతవరకూ తేలలేదు. 2014-15 ఆర్ధిక సంవత్సర ఖాతాలు క్లోజ్ కాలేదు. 2015-16 అర్ధ సంవత్సర ఆర్థిక ఫలితాల్ని కూడా తెలంగాణ విద్యుత్ సంస్థలు ప్రకటించలేదు. దీంతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. జూన్ నెలలో రాష్ట్ర విద్యుత్ సంస్థలకు రూ.300 కోట్ల రుణం ఇస్తున్నట్లు ప్రకటించిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. రుణాలు మంజూరు కావాలంటే మూడేళ్ల బ్యాలెన్స్ షీట్లను ఆర్ధిక సంస్థలకు సమర్పించాలి. రాష్ట్ర విభజనకు ముందు ఉన్న విద్యుత్ సంస్థ ఉమ్మడి లెక్కలను సాంకేతిక కారణాలతో సెపరేట్ చేయలేకపోయారు. దీంతో బ్యాలెన్స్ షీట్లను ఆర్థిక సంస్థలకు అందజేయలేదు. ఇదే రుణాల విషయంలో షాక్ ఇస్తోంది. తెలంగాణ విద్యుత్ సంస్థలు రూ.1,032 కోట్లు తమకు బకాయి ఉన్నట్లు ఏపీ విద్యుత్ సంస్థ ఆడిట్‌లో పేర్కొన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆడిట్ ఊసే లేదు.
తెలంగాణకు 'జల'క్
ఈ ఏడాది ప్రాజెక్ట్‌లలో నీరు అడుగంటిపోవడంతో జలవిద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయి ఆదాయం తగ్గింది. తెలంగాణలో విద్యుత్ కోతలు లేవని ప్రపంచానికి చాటిచెప్పేందుకు వందల కోట్లు ఖర్చు చేసి కరెంట్ కొనుగోలు చేసింది. ఈ ఖర్చును ప్రభుత్వం భరిస్తుందా? విద్యుత్ సంస్థలకు బదలాయిస్తుందా అనేది తేలాల్సి ఉంది. విద్యుత్ సంస్థలకు బదలాయిస్తే కరెంట్ చార్జీలు విపరీతంగా పెరుగుతాయి. విభజన చట్టం ప్రకారం జలవిద్యుత్కేంద్రాలకు నీటి విడుదల బాధ్యత తెలంగాణకు, కేంద్రాల నిర్వహణను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. దీంతో వీటి నుంచి వచ్చే ఆదాయంతోపాటు విలువ కూడా గణనీయంగా పడిపోయిందని అధికారులు చెబుతున్నారు.
అప్పులు ఇచ్చేది లేదని ఆర్థిక సంస్థలు తేల్చి చెబుతున్నాయి. వర్షాభావంతో జల విద్యుత్ ఝలక్ ఇచ్చింది. ఏపీ విద్యుత్ సంస్థతో అప్పులు, ఆస్తుల ఖాతాలు తేలలేదు. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి విద్యుత్ సంస్థలను తెలంగాణ పాలకులు ఎలా గట్టెక్కిస్తారో మరి?
Next Story