Telugu Global
Others

మాజీ సైనికోద్యోగి ఆత్మహత్య యత్నం

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద ఓ  మాజీ సైనికోద్యోగి ఆత్మహత్య యత్నం చేశాడు. సైనికుడిగా దేశానికి సేవలందించిన తనకు ప్రభుత్వం భూమి కేటాయించిందని, అయితే లంచాలకు అలవాటు పడిన సిబ్బంది తనకు భూమి ఎక్కడుందో చూపడం లేదని ఆయన ఆరోపించారు. భుక్తి కోసం భూమి అడుగుతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన చెబుతూ దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య ప్రయత్నం చేశానని చెప్పాడు. ఆయన్ని అడ్డుకున్న సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.

First Published:  2 Aug 2015 6:46 PM IST
Next Story