మూడు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం
పశ్చిమబెంగాల్, ఒరిస్సా, మణిపూర్ రాష్ట్రాలు వర్షాలతో అల్లకల్లోలమై పోతున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు భారీగానే ఆస్తి ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాత్రంతా ఇంటికి కూడా వెళ్ళలేదు. సచివాలయంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు. కొన్ని జిల్లాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. మొత్తం 70 మంది వరకు మరణించారు. రెండు లక్షల మంది సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. కాగా మణిపూర్‌లోను తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఇక్కడ లక్షమంది […]
BY sarvi2 Aug 2015 6:46 PM IST
sarvi Updated On: 3 Aug 2015 11:29 AM IST
పశ్చిమబెంగాల్, ఒరిస్సా, మణిపూర్ రాష్ట్రాలు వర్షాలతో అల్లకల్లోలమై పోతున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు భారీగానే ఆస్తి ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాత్రంతా ఇంటికి కూడా వెళ్ళలేదు. సచివాలయంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు. కొన్ని జిల్లాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. మొత్తం 70 మంది వరకు మరణించారు. రెండు లక్షల మంది సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. కాగా మణిపూర్‌లోను తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఇక్కడ లక్షమంది నిరాశ్రయులయ్యారు. ఒరిషాలో ఐదు లక్షల మందిని సహాయ శిబిరాలకు తరలించారు. మొత్తం మీదు భారతదేశానికి తూర్పు ప్రాంతంలో ఉండే ఈ రాష్ట్రాలన్నీ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి.
Next Story