50 శాతం రిజర్వేషన్లకు కృష్ణయ్య డిమాండ్
వెనుకబడిన తరగతులకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండు చేశారు. నల్గొండ పట్టణంలో బీసీ సమరభేరీ మహాసభకు హాజరైన కృష్ణయ్య రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాజకీయ పార్టీలు కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ అన్నిపార్టీల నాయకులను ఢిల్లీకి తీసుకెళ్లి, బీసీ రిజర్వేషన్లపై చర్చించాలని ఆయన కోరారు. ఈనెల 10,11,12 తేదీల్లో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్. కృష్ణయ్య […]
BY sarvi2 Aug 2015 6:36 PM IST
sarvi Updated On: 3 Aug 2015 4:53 AM IST
వెనుకబడిన తరగతులకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండు చేశారు. నల్గొండ పట్టణంలో బీసీ సమరభేరీ మహాసభకు హాజరైన కృష్ణయ్య రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాజకీయ పార్టీలు కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ అన్నిపార్టీల నాయకులను ఢిల్లీకి తీసుకెళ్లి, బీసీ రిజర్వేషన్లపై చర్చించాలని ఆయన కోరారు. ఈనెల 10,11,12 తేదీల్లో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు.
Next Story