Telugu Global
Others

ఛత్తీస్‌గఢ్‌లో మావోల పంజా

ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు మరోమారు పంజా విసిరారు. రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా బచేలి వద్ద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ ఆధ్వర్యంలోని గనులపై ముప్పేట దాడి చేశారు. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో అన్ని వైపుల నుంచి గనులను చుట్టుముట్టిన మావోలను అక్కడ భద్రతా విధులను పర్యవేక్షిస్తున్న సీఐఎస్ఎఫ్ బలగాలు సమర్ధవంతంగానే ఎదుర్కొన్నాయి. దాదాపు మూడు గంటలపాటు ఇరు వర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. సీఐఎస్ఎఫ్ బలగాల […]

ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు మరోమారు పంజా విసిరారు. రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా బచేలి వద్ద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ ఆధ్వర్యంలోని గనులపై ముప్పేట దాడి చేశారు. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో అన్ని వైపుల నుంచి గనులను చుట్టుముట్టిన మావోలను అక్కడ భద్రతా విధులను పర్యవేక్షిస్తున్న సీఐఎస్ఎఫ్ బలగాలు సమర్ధవంతంగానే ఎదుర్కొన్నాయి. దాదాపు మూడు గంటలపాటు ఇరు వర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. సీఐఎస్ఎఫ్ బలగాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైన నేపథ్యంలో మావోలు ఎన్ఎండీసీకి చెందిన పలు వాహనాలు, యంత్ర సామగ్రికి నిప్పు పెట్టారు. దీంతో రూ.50 కోట్ల మేర విలువ చేసే పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి.
First Published:  2 Aug 2015 1:12 PM GMT
Next Story