డీఆర్‌డీఓకు కలాం పేరు కోసం కేసీఆర్ సిఫార్సు
హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ(రక్షణ పరిశోధన సంస్థ)కు దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి లేఖ రాశారు. ప్రతిష్ఠాత్మకమైన డీఆర్‌డీఓకు అబ్దుల్ కలాం డైరెక్టర్‌గా పని చేశారని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రక్షణ సంస్థల ఏర్పాటు వెనుక అబ్దుల్ కలాం విశేష కృషి ఉందని, ఆయన కృషి వల్లే డీఆర్‌డీఎల్, మిథాని, ఆర్‌సీఐ, ఐసీబీఎం సంస్థలు ఏర్పడ్డాయన్నారు. […]
BY sarvi2 Aug 2015 6:38 PM IST
sarvi Updated On: 3 Aug 2015 5:02 AM IST
హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ(రక్షణ పరిశోధన సంస్థ)కు దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి లేఖ రాశారు. ప్రతిష్ఠాత్మకమైన డీఆర్‌డీఓకు అబ్దుల్ కలాం డైరెక్టర్‌గా పని చేశారని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రక్షణ సంస్థల ఏర్పాటు వెనుక అబ్దుల్ కలాం విశేష కృషి ఉందని, ఆయన కృషి వల్లే డీఆర్‌డీఎల్, మిథాని, ఆర్‌సీఐ, ఐసీబీఎం సంస్థలు ఏర్పడ్డాయన్నారు. డీఆర్‌డీఓకు కలాం పేరు పెట్టడం భావి తరాలకు స్ఫూర్తినిస్తుందని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.
Next Story