జర నవ్వండి ప్లీజ్ 163
వంట “నేను ఐదేళ్ళ నించీ వంట చేస్తున్నాను” “అయ్యో ఇంకా పూర్తి కాలేదా?” ———————————————- ఈత వాసు: నువ్వు ఈత కొట్టడం ఎక్కడ నేర్చుకున్నావు? శీను: నీళ్ళలో! ———————————————- గాంధీ మాట “అప్పుడు గాంధీజీ నెహ్రూతో ఏమన్నారు?” అని అడిగింది టీచర్. “నాకెలా తెలుస్తుందండీ! నేనప్పుడక్కడ లేను”. ———————————————- టెన్త్‌ఫ్లోర్ బంధువుల ఇంటికి వచ్చిన ఒకాయన ఇలా అంటున్నాడు. “లిఫ్ట్‌బాయ్! నన్ను టెన్త్‌ఫ్లోర్ దాకా తీసుకెళ్లు” “ఇక్కడ ఆరుఫ్లోర్లే ఉన్నాయండి” “నో ప్రాబ్లం! తక్కిన నాలుగు మెట్లెక్కి […]
వంట
“నేను ఐదేళ్ళ నించీ వంట చేస్తున్నాను”
“అయ్యో ఇంకా పూర్తి కాలేదా?”
———————————————-
ఈత
వాసు: నువ్వు ఈత కొట్టడం ఎక్కడ నేర్చుకున్నావు?
శీను: నీళ్ళలో!
———————————————-
గాంధీ మాట
“అప్పుడు గాంధీజీ నెహ్రూతో ఏమన్నారు?” అని అడిగింది టీచర్.
“నాకెలా తెలుస్తుందండీ! నేనప్పుడక్కడ లేను”.
———————————————-
టెన్త్‌ఫ్లోర్
బంధువుల ఇంటికి వచ్చిన ఒకాయన ఇలా అంటున్నాడు.
“లిఫ్ట్‌బాయ్! నన్ను టెన్త్‌ఫ్లోర్ దాకా తీసుకెళ్లు”
“ఇక్కడ ఆరుఫ్లోర్లే ఉన్నాయండి”
“నో ప్రాబ్లం! తక్కిన నాలుగు మెట్లెక్కి వెళతాలే”