Telugu Global
NEWS

అశ్లీల వెబ్‌సైట్లపై కేంద్రం అనధికార నిషేధం

అశ్లీల వెబ్‌సైట్లను కేంద్రం అనధికారికంగా నిషేధించింది. ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల (ఐఎస్పీలు) ద్వారా వాటిని బ్లాక్‌ చేయించింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే.. ఉచిత, పెయిడ్‌ అన్నీ కలిపి 4860 పోర్న్‌ వెబ్‌సైట్లను 8 ఐఎస్పీలు బ్లాక్‌ చేశాయి. అశ్లీల వెబ్‌సైట్లు, చిత్రాలను అరికట్టడంలో ఇది తొలి చర్యగా కేంద్రం భావిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం పోర్న్‌వెబ్‌సెట్లను నిషేదించడమంటే వ్యక్తిగత సేచ్ఛను హరించినట్లే అవుతుందని ఇటీవల సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ వెబ్‌సైట్లను చిన్నారులు చూడకుండా, పబ్లిక్‌గా […]

అశ్లీల వెబ్‌సైట్లపై కేంద్రం అనధికార నిషేధం
X
అశ్లీల వెబ్‌సైట్లను కేంద్రం అనధికారికంగా నిషేధించింది. ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల (ఐఎస్పీలు) ద్వారా వాటిని బ్లాక్‌ చేయించింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే.. ఉచిత, పెయిడ్‌ అన్నీ కలిపి 4860 పోర్న్‌ వెబ్‌సైట్లను 8 ఐఎస్పీలు బ్లాక్‌ చేశాయి. అశ్లీల వెబ్‌సైట్లు, చిత్రాలను అరికట్టడంలో ఇది తొలి చర్యగా కేంద్రం భావిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం పోర్న్‌వెబ్‌సెట్లను నిషేదించడమంటే వ్యక్తిగత సేచ్ఛను హరించినట్లే అవుతుందని ఇటీవల సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ వెబ్‌సైట్లను చిన్నారులు చూడకుండా, పబ్లిక్‌గా వీక్షించకుండా నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్రం వ్యూహాత్మకంగా వెబ్‌సైట్ల నిషేధం జోలికి వెళ్లకుండా సర్వీస్‌ ప్రొవైడర్ల ద్వారా కట్టడి చేయాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేశంలోని 32 ఐఎస్పీలతో సమావేశం ఏర్పాటు చేసి పోర్న్‌ సైట్స్‌ను బ్లాక్‌ చేయాలని ఆదేశించింది. దీంతో ఆదివారం తెల్లవారుజాము నుంచే, ప్రభుత్వ రంగానికి చెందిన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌, ప్రైవేటు రంగంలోని యాక్ట్‌, హాత్‌వే, వొడాఫోన్‌, రెడ్‌ జింజర్‌, ఆసియానెట్‌ వంటి ఐఎస్పీలు పోర్న్‌ సైట్స్‌ను బ్లాక్‌ చేశాయి.
First Published:  3 Aug 2015 4:37 AM IST
Next Story