Telugu Global
Others

రైతులిచ్చిన‌ భూముల్లో స‌ర్కారు లేఔట్లు..

చురుగ్గా స‌న్నాహాలు చేస్తున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప‌రిహారం ఇవ్వ‌కుండా ఇదేం ప‌ని అంటూ రైతుల్లో ఆగ్ర‌హావేశాలు న‌వ్యాంధ్రప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు పరిహారంగా ఇవ్వాల్సిన స్థలాలపై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇంకా ఎలాంటి నిర్ణ‌య‌మూ తీసుకోలేదు. రైతుల‌కు ప‌రిహారంగా అభివృద్ధి చేసిన స్థ‌లాల‌ను ఇస్తామ‌ని ముఖ్య‌మంత్రి, మంత్రులు ఊద‌ర‌గొట్టారు. కానీ ఆ స్థ‌లాలు ఎక్క‌డ ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? అనే దానిపై ఎవ‌రికీ స్ప‌ష్ట‌త లేదు. మ‌రోవైపు రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో […]

రైతులిచ్చిన‌ భూముల్లో స‌ర్కారు లేఔట్లు..
X
చురుగ్గా స‌న్నాహాలు చేస్తున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం
ప‌రిహారం ఇవ్వ‌కుండా ఇదేం ప‌ని అంటూ రైతుల్లో ఆగ్ర‌హావేశాలు
న‌వ్యాంధ్రప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు పరిహారంగా ఇవ్వాల్సిన స్థలాలపై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇంకా ఎలాంటి నిర్ణ‌య‌మూ తీసుకోలేదు. రైతుల‌కు ప‌రిహారంగా అభివృద్ధి చేసిన స్థ‌లాల‌ను ఇస్తామ‌ని ముఖ్య‌మంత్రి, మంత్రులు ఊద‌ర‌గొట్టారు. కానీ ఆ స్థ‌లాలు ఎక్క‌డ ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? అనే దానిపై ఎవ‌రికీ స్ప‌ష్ట‌త లేదు. మ‌రోవైపు రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో లేఔట్లు వేయడానికి సన్నాహాలు చేస్తోంది. సింగపూర్‌ నుంచి క్యాపిటల్‌ సిటీ, సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ప్లాన్లు అందిన నేపథ్యంలో.. ఇక రాజధాని ప్రాంతంలో లే-ఔట్లను వేయాలని నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన ముహూర్తం సమీపిస్తున్నందున గడువు నాటికి కనీసం లేఔట్ల ప్లానింగ్‌ను కొంత మేరకైనా సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన తేదీగా నిర్ధారించిన విజయదశమి, అక్టోబర్‌ 22 నాటికి తొలిదశ లే-ఔట్ల ప్లానింగ్‌ను పూర్తి చేయాలని భావిస్తోంది. కాగా, త‌మ‌కు ప‌రిహారంగా ఇవ్వాల్సిన వాటి గురించి ప‌ట్టించుకోకుండా తాము ఇచ్చిన భూముల్లో లేఔట్లు వేయ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు ప్రారంభించ‌డంపై రైతులు ఆగ్ర‌హంతో ఉన్నారు. త‌మ‌కు ప‌రిహారంగా ఇస్తాన‌న్న‌స్థ‌లాల గురించి తేల్చ‌క‌ముందే త‌మ భూముల్లో ప్ర‌భుత్వం రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల మాదిరిగా లే ఔట్లు వేయ‌డానికి స‌న్నాహాలు చేయడం రైతుల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. కాగా, రాజధాని నిర్మాణంపై ఏర్పాటైన సలహా సంఘం ఆదివారం సచివాలయంలో సమావేశమైంది. మున్సిపల్‌ శాఖ మంత్రి పి నారాయణ ఈ స‌మావేశానికి అధ్యక్షత వహించారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి రెండోదశలో సింగపూర్‌ నుంచి సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌ అందిన తరువాత ఈ కమిటీ భేటీ కావడం ఇదే తొలిసారి. క్యాపిటల్‌ రీజియన్‌ మాస్టర్‌ ప్లాన్‌, సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌పై ఈ కమిటీలో చర్చించారు. రైతుల‌కు స్థ‌లాలివ్వాల్సిన అంశంపై ఈ స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. లే ఔట్లను వేసిన తరువాత అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు పరిహారంగా అందజేయాలని చెప్పారు. రైతుల‌కు ప‌రిహారం ఇవ్వ‌కుండానే రాజ‌ధాని ప్రాంతంలో ప్ర‌భుత్వం లేఔట్ల‌ను ప్రారంభిస్తే వ్య‌తిరేక‌త వ‌చ్చే ప్ర‌మాద‌ముంద‌ని స‌మావేశంలో ఒక‌రిద్ద‌రు ప్ర‌స్తావించిన‌ట్లు స‌మాచారం.
First Published:  3 Aug 2015 2:21 AM IST
Next Story