బూతు సైట్లపై నిషేధం తప్పు: రాంగోపాల్‌వర్మ
బూతు సైట్లపై నిషేధం ఏంటి నాన్సెన్స్ అంటున్నారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈ సైట్లపై నిషేధం విధిస్తే లైంగిక నేరాలు తగ్గిపోతాయా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య తిరోగమన చర్యేనన్నది ఆయన అభిప్రాయం. తన మనోగతాన్ని చెప్పడానికి ఆయన తన ట్విట్టర్ అకౌంట్ వాడుకున్నారు. ‘దేన్నైనా నిషేధిస్తే, అది తెరవెనుక బలం పుంజుకుంటుంది. ఇది చరిత్రలో చాలాసార్లు నిరూపితమైంది. వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వం ఏ రూపంలోనైనా హరిస్తే, అది ఆ దేశ […]
BY admin3 Aug 2015 12:40 AM IST
X
admin Updated On: 3 Aug 2015 6:15 AM IST
బూతు సైట్లపై నిషేధం ఏంటి నాన్సెన్స్ అంటున్నారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈ సైట్లపై నిషేధం విధిస్తే లైంగిక నేరాలు తగ్గిపోతాయా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య తిరోగమన చర్యేనన్నది ఆయన అభిప్రాయం. తన మనోగతాన్ని చెప్పడానికి ఆయన తన ట్విట్టర్ అకౌంట్ వాడుకున్నారు. ‘దేన్నైనా నిషేధిస్తే, అది తెరవెనుక బలం పుంజుకుంటుంది. ఇది చరిత్రలో చాలాసార్లు నిరూపితమైంది. వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వం ఏ రూపంలోనైనా హరిస్తే, అది ఆ దేశ సామాజిక పురోగతిని తిరోగమించేలా చేస్తుంది. అశ్లీల చిత్రాలు లైంగిక నేరాలను పెంచవని, పైగా లైంగిక నిగ్రహానికి అది ఒక సురక్షిత మార్గమని పలు అంతర్జాతీయ సర్వేల్లో నిరూపితమైన సత్యం’అని ఆయన తన ట్వీట్లలో స్పందించారు. పోర్న్ సైట్లపై నిషేధం విధించడం కన్నా, ఆ కంటెంట్ తప్పుడు మార్గంలో వెళ్లకుండా చూడటం బెటరని వర్మ అభిప్రాయం.
Next Story