Telugu Global
Others

మూడు గ్రూపులుగా ఓబీసీల వర్గీకరణ

ఓబీసీల్లో వెనకబాటుతనం ఆధారంగా 3 గ్రూపులుగా విభజించాలని వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ (ఎన్సీబీసీ) కేంద్రానికి నివేదిక సమర్పించింది. అత్యంత వెనుకబడిన తరగతులు (ఈబీసీ), బాగా వెనుకబడిన తరగతులు (ఎమ్‌బీసీ), వెనుకబడిన తరగతులు (బీసీ)లుగా విభజించాలని సూచించినట్లు కేంద్ర సామాజిక న్యాయ మంత్రి కృష్ణపాల్‌ గుర్జర్‌ లోక్‌సభకు తెలిపారు. వెనుకబడిన తరగతుల్లో ఉన్న ‘అత్యంత వెనకబడిన కులాల’కు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదలను రూపొందించినట్టు చెప్పారు. ఈబీసీ గ్రూపులో ఆదీవాసీలు, విముక్త జాతులు, సంచార జాతులు, […]

ఓబీసీల్లో వెనకబాటుతనం ఆధారంగా 3 గ్రూపులుగా విభజించాలని వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ (ఎన్సీబీసీ) కేంద్రానికి నివేదిక సమర్పించింది. అత్యంత వెనుకబడిన తరగతులు (ఈబీసీ), బాగా వెనుకబడిన తరగతులు (ఎమ్‌బీసీ), వెనుకబడిన తరగతులు (బీసీ)లుగా విభజించాలని సూచించినట్లు కేంద్ర సామాజిక న్యాయ మంత్రి కృష్ణపాల్‌ గుర్జర్‌ లోక్‌సభకు తెలిపారు. వెనుకబడిన తరగతుల్లో ఉన్న ‘అత్యంత వెనకబడిన కులాల’కు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదలను రూపొందించినట్టు చెప్పారు. ఈబీసీ గ్రూపులో ఆదీవాసీలు, విముక్త జాతులు, సంచార జాతులు, భిక్షాటన చేసుకునేవారు, ఎరుకలు, పాములు పట్టేవాళ్లు, వ్యవసాయ కూలీలు, జాలర్లు మొదలైన వారిని కలపాలని ఎన్సీబీసీ సూచించింది. ఎమ్‌బీసీలో కులవృత్తులు చేసుకునే బొమ్మల తయారీ, గీత కార్మికులు, చేనేత, కుమ్మరి, గొర్రెల కాపరులు, దర్జీ, మంగలితోపాటు క్రైస్తవంలోకి మారిన దళితులు, బీసీలో వెనుకబడిన వారిలో కాస్త పర్వాలేదనిపించిన కులాలను ఇందులో చేర్చాలని పేర్కొంది.
First Published:  1 Aug 2015 6:48 PM IST
Next Story