మండలి చైర్మన్‌గా ప్రతిభా భారతి లేదా సోమిరెడ్డీ ?
ఏపీ మండలి చైర్మన్ గా మాజీ అసెంబ్లీ స్పీకర్ ప్రతిభా భారతి ఎంపిక కానుందని సమాచారం. ఏపీ శాసనమండలిలో ఇప్పటిదాకా కాంగ్రెస్ సభ్యులదే మెజారిటీ. ఇటీవల జరిగిన మండలి ఎన్నికల్లో టీడీపీ తిరిగి మెజారిటీ సాధించింది. దీనికితోడు మండలి చైర్మన్ చక్రపాణి పదవీకాలం ముగియనుంది. దీంతో నూతన చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి ఎవరు చైర్మన్ అవుతారన్న ప్రశ్న తలెత్తింది. దీనికి మాజీ స్పీకర్ ప్రతిభా భారతి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. […]
BY Pragnadhar Reddy1 Aug 2015 9:05 PM GMT
X
Pragnadhar Reddy Updated On: 1 Aug 2015 9:09 PM GMT
ఏపీ మండలి చైర్మన్ గా మాజీ అసెంబ్లీ స్పీకర్ ప్రతిభా భారతి ఎంపిక కానుందని సమాచారం. ఏపీ శాసనమండలిలో ఇప్పటిదాకా కాంగ్రెస్ సభ్యులదే మెజారిటీ. ఇటీవల జరిగిన మండలి ఎన్నికల్లో టీడీపీ తిరిగి మెజారిటీ సాధించింది. దీనికితోడు మండలి చైర్మన్ చక్రపాణి పదవీకాలం ముగియనుంది. దీంతో నూతన చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి ఎవరు చైర్మన్ అవుతారన్న ప్రశ్న తలెత్తింది. దీనికి మాజీ స్పీకర్ ప్రతిభా భారతి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రతిభాభారతితో పాటు మరో మైనారిటీ అభ్యర్థి కూడా పదవి రేసులో ఉన్నట్లు తెలిసింది. పశ్చిమగోదావరి కి చెందిన షరీఫ్ పేరును సైతం చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరితోపాటు సీనియర్ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ప్రతిపక్షంగా వైఎస్సార్ సీపీ సైతం బలంగా ఉంది. ఈ క్రమంలో సభను నడిపేందుకు అనుభవజ్ఞులైతే మంచిదని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. స్వతహాగా దూకుడు ఎక్కువగా ఉండే సోమిరెడ్డి ఈ పదవిలో ఎలా రాణిస్తారన్న దానిపై పార్టీ ఆలోచిస్తోంది. ప్రతిభా భారతికి గతంలో ఏపీ అసెంబ్లీని నడిపిన అనుభవం ఉంది. తొలిసారి మండలి చైర్మన్ పదవిని మైనారిటీ నేతకు ఇచ్చినా బాగానే ఉంటుందన్న ప్రతిపాదన సైతం ఉండటంతో స్పీకర్ ఎంపిక ఆసక్తికరంగా మారింది.
Next Story