జర నవ్వండి ప్లీజ్ 162
ముద్దు… క్రిములు ఒక ప్రొఫెసర్ క్లాసులో సూక్ష్మక్రిముల గురించి చెబుతున్నాడు. “ఒక అబ్బాయి ఒకమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడనుకో. నిముషానికి అతని ముద్దు ద్వారా అమ్మాయి నోట్లోకి నలభైవేల సూక్ష్మక్రిములు వెళతాయి తెలుసా?” అన్నాడు. అందరూ ఆసక్తిగా విన్నారు. “అట్లాంటప్పుడు మనం ఎట్లాంటి చర్య తీసుకోవాలి?” ప్రశ్నించాడు ప్రొఫెసర్. వెంటనే ఒకమ్మాయి లేచి “ఆ నలభై వేల క్రిముల్ని తిరిగి ఆ అబ్బాయికి ఇచ్చేయాలి” అంది. ————————————————— పిల్ల చేష్టలు ఒక బర్త్‌డే పార్టీలో ఇద్దరు పిల్లలు గొప్పలు […]
ముద్దు… క్రిములు
ఒక ప్రొఫెసర్ క్లాసులో సూక్ష్మక్రిముల గురించి చెబుతున్నాడు.
“ఒక అబ్బాయి ఒకమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడనుకో. నిముషానికి అతని ముద్దు ద్వారా అమ్మాయి నోట్లోకి నలభైవేల సూక్ష్మక్రిములు వెళతాయి తెలుసా?” అన్నాడు.
అందరూ ఆసక్తిగా విన్నారు.
“అట్లాంటప్పుడు మనం ఎట్లాంటి చర్య తీసుకోవాలి?” ప్రశ్నించాడు ప్రొఫెసర్.
వెంటనే ఒకమ్మాయి లేచి “ఆ నలభై వేల క్రిముల్ని తిరిగి ఆ అబ్బాయికి ఇచ్చేయాలి” అంది.
—————————————————
పిల్ల చేష్టలు
ఒక బర్త్‌డే పార్టీలో ఇద్దరు పిల్లలు గొప్పలు చెప్పకుంటున్నారు.
కుర్రాడు: మా నాన్న మీ నాన్నని కొట్టేస్తాడు తెలుసా?
రెండో కుర్రాడు: అదేం గొప్ప కాదు, మా అమ్మను కొట్టమను చూద్దాం.
—————————————————
సస్పెన్స్
సురేష్ తన క్లాసుమేట్ రమేష్‌తో “ఒక బుద్ధిహీనుణ్ణి సస్పెన్స్‌లో పెట్టడం ఎలాగో తెలుసా?” అని అడిగాడు.
రమేష్ ఉత్సాహంగా, “తెలీదు, ఎలా?” అన్నాడు.
“సరేలే, ఇంకో రోజు చెబుతాలే” అన్నాడు సురేష్.
—————————————————
25 గంటల పని
పనీపాట లేని ఇద్దరు ప్రభుత్వోద్యోగులు ఇలా మాట్లాడుకుంటున్నారు.
రాజు: నేను రోజుకి 25 గంటలు పనిచేస్తాను.
సుబ్బారావు: అదెలా సాధ్యం?
రాజు: అందుకే రోజూ ఒక గంట ముందే నిద్రలేస్తాను.