15న డొక్కా 'దేశం' లోకి ప్రవేశం?
మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈ నెల 15న టీడీపీలోకి చేరటానికి రంగం సిద్ధమైంది. ఆయన పార్టీలోకి రావటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చంద్రబాబుకు ఎంపీ రాయపాటి వివరించి ఒప్పించినట్లు తెలిసింది. డొక్కాను చేర్చుకోవటానికి సీఎం అంగీకరించినట్టు తెలిసింది. నిజానికి డొక్కాని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి రంగం సిద్ధమైన తర్వాత రాయపాటి దానికి అడ్డు తగలడంతో అప్పట్లో ఆయన నిర్ణయాన్ని విరమించుకున్నారు. రాయపాటి డొక్కాకు రాజకీయ గురువు కావడంతో ఆయన […]
BY Pragnadhar Reddy2 Aug 2015 5:10 AM IST
X
Pragnadhar Reddy Updated On: 2 Aug 2015 5:10 AM IST
మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈ నెల 15న టీడీపీలోకి చేరటానికి రంగం సిద్ధమైంది. ఆయన పార్టీలోకి రావటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చంద్రబాబుకు ఎంపీ రాయపాటి వివరించి ఒప్పించినట్లు తెలిసింది. డొక్కాను చేర్చుకోవటానికి సీఎం అంగీకరించినట్టు తెలిసింది. నిజానికి డొక్కాని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి రంగం సిద్ధమైన తర్వాత రాయపాటి దానికి అడ్డు తగలడంతో అప్పట్లో ఆయన నిర్ణయాన్ని విరమించుకున్నారు. రాయపాటి డొక్కాకు రాజకీయ గురువు కావడంతో ఆయన మాట కాదనలేక వైఎస్‌ఆర్ పార్టీకి దూరం జరిగారు. ఆ తర్వాత వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరకుండా రాయపాటి మాటను తాను జవదాటలేనని, ప్రస్తుతం తాను ఏపార్టీలోనూ చేరే అవకాశం లేదని మిన్నకుండి పోయారు. మళ్ళీ దాదాపు నెల రోజుల తర్వాత టీడీపీలోకి ప్రవేశించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డొక్కా చేరిక రాయపాటి ప్రభావితంతోనే జరుగుతుందన్నది జగద్విదితం.
Next Story