యనమలను ఢిల్లీకి సాగనంపుతారా?
టీడీపీలో చినబాబుకు లైన్ క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? పార్టీలో సీనియర్లను సాగనంపడం లేదా వారి అధికారాలను పరిమితం చేసే పనికి చంద్రబాబు పూనుకున్నారా? ప‌్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం ఇదే భావనలో ఉన్నారు. వారి అభిప్రాయం ప్రకారం… పార్టీలో ఒక్కో అడ్డంకిని చంద్రబాబు వ్యూహాత్మకంగా తొలగిస్తున్నారు. ఇందులో భాగంగానే పలువురికి పదవులు ఇవ్వకుండా పక్క నుంచారని చెబుతున్నారు. ప్రస్తుతం యనమల వంతు వచ్చింది. ఇటీవల ఓటుకు నోటు కుంభకోణం కేసులో చంద్రబాబును అరెస్టు చేస్తారని ప్రచారం […]
BY Pragnadhar Reddy2 Aug 2015 2:54 AM IST
X
Pragnadhar Reddy Updated On: 2 Aug 2015 2:54 AM IST
టీడీపీలో చినబాబుకు లైన్ క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? పార్టీలో సీనియర్లను సాగనంపడం లేదా వారి అధికారాలను పరిమితం చేసే పనికి చంద్రబాబు పూనుకున్నారా? ప‌్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం ఇదే భావనలో ఉన్నారు. వారి అభిప్రాయం ప్రకారం… పార్టీలో ఒక్కో అడ్డంకిని చంద్రబాబు వ్యూహాత్మకంగా తొలగిస్తున్నారు. ఇందులో భాగంగానే పలువురికి పదవులు ఇవ్వకుండా పక్క నుంచారని చెబుతున్నారు. ప్రస్తుతం యనమల వంతు వచ్చింది. ఇటీవల ఓటుకు నోటు కుంభకోణం కేసులో చంద్రబాబును అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. అలా జరిగితే తరువాత సీఎం ఎవరన్న ప్రశ్న తలెత్తింది. అందుకు సమాధానంగా యనమల పేరు వినబడింది. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఆ ప్రచారాన్ని యనమల ఖండించారు. ఆ వదంతి ఎలా బయటికి వచ్చిందో తెలియదని బాబుకు వివరించారు. అయినా అప్పటి నుంచి బాబు ఆయనపై అసంతృప్తిగానే ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా మంత్రిగా ఆయనకు తగిన ప్రాధాన్యం కూడా లభించడం లేదని యనమల కొంతకాలంగా అలకబూనారు. నమ్మినబంటుగా సేవలందించినా.. చంద్రబాబు తీరుతో ఆయన నొచ్చుకున్నారని తెలిసింది. దీంతో రాష్ర్ట రాజకీయాల కన్నా.. ఢిల్లీకి వెళ్లడం ఉత్తమమని నిర్ణయించుకున్నారని సమాచారం. అందుకే త్వరలో రాష్ట్రంలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. మెజారిటీ పరంగా చూస్తే.. 3 సీట్లు టీడీపీ గెలుచుకుంటుంది. ఇందులో ఒకటి బీజేపీకి ఇస్తుంది. మిగిలిన రెండింటిలో ఒకటి ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న సుజనా చౌదరికి ఇస్తారు. మిగిలిన ఒక సీటును తనకు ఇవ్వాల్సిందిగా యనమల చంద్రబాబును కోరుతున్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర రాజకీయాలకు తగినంత దూరంగా ఉండవచ్చన్నది ఆయన వ్యూహమని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Next Story