Telugu Global
Others

మిత్రదేశం జపాన్‌పై అమెరికా గూఢచర్యం

అగ్రరాజ్యం అమెరికాకు చెందిన మరికొన్ని రహస్యాలను వికీలీక్స్ వెల్లడించింది. జపాన్ ప్రభుత్వంపైనా, ఆ దేశానికి చెందిన పలు సంస్థలపైనా అమెరికా గూఢచర్యానికి పాల్పడిందని వికీలీక్స్ పేర్కొంది. ప్రభుత్వ పెద్దలపైనే కాకుండా ఓ అగ్రశ్రేణి సెంట్రల్ బ్యాంకుపైనా, మిత్సుబిషి వంటి దిగ్గజ సంస్థలపైనా అమెరికా వర్గాలు గూఢచర్యానికి పాల్పడ్డాయని తెలిపింది. అమెరికా నిఘా ఎంత లోతైనదో ఈ వివరాలతో అర్థమవుతోందని, గూఢచర్యం ద్వారా సేకరించిన వివరాల్లో వ్యాపార, వాతావరణ, దౌత్య, అణుశక్తి సంబంధమైన అంశాలున్నాయని పేర్కొంది. కాగా ఆసియా-పసిఫిక్ […]

అగ్రరాజ్యం అమెరికాకు చెందిన మరికొన్ని రహస్యాలను వికీలీక్స్ వెల్లడించింది. జపాన్ ప్రభుత్వంపైనా, ఆ దేశానికి చెందిన పలు సంస్థలపైనా అమెరికా గూఢచర్యానికి పాల్పడిందని వికీలీక్స్ పేర్కొంది. ప్రభుత్వ పెద్దలపైనే కాకుండా ఓ అగ్రశ్రేణి సెంట్రల్ బ్యాంకుపైనా, మిత్సుబిషి వంటి దిగ్గజ సంస్థలపైనా అమెరికా వర్గాలు గూఢచర్యానికి పాల్పడ్డాయని తెలిపింది. అమెరికా నిఘా ఎంత లోతైనదో ఈ వివరాలతో అర్థమవుతోందని, గూఢచర్యం ద్వారా సేకరించిన వివరాల్లో వ్యాపార, వాతావరణ, దౌత్య, అణుశక్తి సంబంధమైన అంశాలున్నాయని పేర్కొంది. కాగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు మిత్రదేశంగా ఉన్న జపాన్ చేదోడువాదోడుగా ఉంటోంది. రక్షణ, ఆర్థిక, వాణిజ్య రంగ అంశాల్లో ఇరుదేశాల మధ్య నిరంతరం సంప్రదింపులు జరుగుతుంటాయి. అలాంటి మిత్రదేశంపైనే అమెరికా గూఢచర్యానికి పాల్పడిందని వికీలీక్స్ తెలిపింది.
First Published:  31 July 2015 6:42 PM IST
Next Story