తెలుగు రాష్ర్టాలది `ప్రత్యేక` బాధ
ఏ రాష్ర్టానికైనా, దేశానికైనా సమస్యలుంటాయి. బాధలూ ఉంటాయి. కష్టాలు వస్తాయి. నష్టాలు కలుగుతాయి. కానీ ఇందులో ప్రత్యేకత ఏముంటుంది? అంటే ..తెలుగు రాష్ర్టాలకు `ప్రత్యేక` బాధ పట్టుకుంది. విడిపోక ముందు ఎవరి ఆకాంక్షలు వారికి `ప్రత్యేకం`గా ఉండేవి. కలిసుండాలనేది ఏపీ వాళ్ల `ప్రత్యేక` కోరిక. విడిపోవాలనేది తెలంగాణ ప్రజల `ప్రత్యేక` ఆకాంక్ష. రెండు రాష్ర్టాలు అన్నింట్లోనూ ప్రత్యేకమే. ఆచార వ్యవహారాల్లోనూ..సంస్కృతి సంప్రదాయల్లోనూ విభిన్నంగా ఉంటాయి.పండగలు జరుపుకోవడంలోనూ, జీవనవిధానంలోనూ ప్రాంతాల మధ్య స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తుంది. అయితే కేంద్రం […]
ఏ రాష్ర్టానికైనా, దేశానికైనా సమస్యలుంటాయి. బాధలూ ఉంటాయి. కష్టాలు వస్తాయి. నష్టాలు కలుగుతాయి. కానీ ఇందులో ప్రత్యేకత ఏముంటుంది? అంటే ..తెలుగు రాష్ర్టాలకు 'ప్రత్యేక' బాధ పట్టుకుంది. విడిపోక ముందు ఎవరి ఆకాంక్షలు వారికి 'ప్రత్యేకం'గా ఉండేవి. కలిసుండాలనేది ఏపీ వాళ్ల 'ప్రత్యేక' కోరిక. విడిపోవాలనేది తెలంగాణ ప్రజల 'ప్రత్యేక' ఆకాంక్ష. రెండు రాష్ర్టాలు అన్నింట్లోనూ ప్రత్యేకమే. ఆచార వ్యవహారాల్లోనూ..సంస్కృతి సంప్రదాయల్లోనూ విభిన్నంగా ఉంటాయి.పండగలు జరుపుకోవడంలోనూ, జీవనవిధానంలోనూ ప్రాంతాల మధ్య స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తుంది. అయితే కేంద్రం వద్దకు వెళ్లేటప్పుడు మాత్రం ఇరు రాష్ర్టాలదీ ఒకటే బాధ. ఇరు ప్రాంతాలది ఒకటే కోరిక. అదే 'ప్రత్యేక' బాధ. 'ప్రత్యేక' కోరిక. అయితే ఈ ప్రత్యేకం విషయంలో ఏ ఒక్కరి వైపు మొగ్గకుండా కేంద్రం తన చుట్టూ తిప్పుకుంటోంది. సర్కస్‌లో రింగ్‌మాస్టర్‌లా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం..ఏపీ, తెలంగాణ రాష్ర్టాలతో ఓ ఆటాడుకుంటోంది. ప్రత్యేక హోదా కావాలని ఏపీ పట్టుబడుతుంటే..ఇచ్చే సమస్యే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. అయినా పట్టువదలని కొందరు ఏపీ నేతలు రోజూ ప్రత్యేక హోదా సాధిస్తామంటూనే ఉన్నారు. ఉద్యమిస్తామని చెబుతూనే ఉన్నారు. ప్రత్యేక హోదా తమ ప్రత్యేక కోరిక అని ఏపీ కేంద్రానికి మొరపెట్టుకుంటోంది. ఏపీ కోరిక కేంద్రం నెరవేర్చకూడదని తెరవెనుక తెలంగాణ పోరాడుతోంది. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే హైదరాబాద్‌ను విశ్వనగరం చేయాలనుకుంటున్న కేసీఆర్ ఆశలు అడియాసలవుతాయనే భయం తెలంగాణ ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. ఇక తెలంగాణది ప్రత్యేక హైకోర్టు కోరిక కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. ప్రత్యేక హైకోర్టు ఇవ్వొద్దనేది ఏపీ కోరిక. ప్రత్యేక హైకోర్టు ఇస్తే ఉమ్మడి రాజధానిలో ఇప్పటికే చాలా అన్యాయానికి గురయ్యామని, ప్రత్యేక హైకోర్టు తెలంగాణకు వస్తే..ఏపీ అన్ని విధాలుగా ఇరుక్కుపోతుందనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భయం. ఇరు రాష్ర్టాల 'ప్రత్యేక' కోరికలు, 'ప్రత్యేక' భయాలను ఆసరాగా చేసుకుని ఎన్‌డీఏ ప్రభుత్వం ఓ ఆట ఆడుకుంటోంది. ఎవరి 'ప్రత్యేక' కోరిక ముందు నెరవేరుతుందో మరి.