కదం తొక్కుతున్న విద్యార్థులు
రిషితేశ్వరి కేసులో దోషులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనలు ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయం (ఎఎన్‌యు) విద్యార్థిని రిషితేశ్వరి మృతికి కారకు లైన దోషులను కఠినంగా శిక్షించాలని, ప్రిన్సి పాల్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. తాజాగా విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి విద్యా ర్థులు యత్నించారు. ముందుగా విద్యార్థులు ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు, ఎఐఎస్‌ఎఫ్ సంయుక్త ఆధ్వర్యాన ప్రదర్శనగా అక్కడికి చేరుకున్నారు. కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో […]
BY Pragnadhar Reddy1 Aug 2015 1:24 AM IST
X
Pragnadhar Reddy Updated On: 1 Aug 2015 6:42 AM IST
రిషితేశ్వరి కేసులో దోషులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనలు
ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయం (ఎఎన్‌యు) విద్యార్థిని రిషితేశ్వరి మృతికి కారకు లైన దోషులను కఠినంగా శిక్షించాలని, ప్రిన్సి పాల్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. తాజాగా విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి విద్యా ర్థులు యత్నించారు. ముందుగా విద్యార్థులు ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు, ఎఐఎస్‌ఎఫ్ సంయుక్త ఆధ్వర్యాన ప్రదర్శనగా అక్కడికి చేరుకున్నారు. కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు అక్కడే బైఠాయించి ధర్నా చేశారు. పోలీసులు వారిని ఈడ్చుకెళ్లి బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించి. వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. రిషితేశ్వరి కుటుంబ సభ్యులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా పొన్నూరులో బిపిఎన్ కళాశాల విద్యార్థులు భారీ ప్రదర్శన, ఐలాండ్ సెంటర్‌లో మానవహారం నిర్మించారు. రాజమండ్రిలో ర్యాగింగ్ భూతం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సామర్లకోటలో కొవ్వొత్తుల ర్యాలీ, ఏలేశ్వరం, పిఠాపురాల్లో మానవహారం, పెద్దాపురంలో రాస్తారోకో నిర్వహించారు. నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీ కళాశాల విద్యార్థులు నిర్వహించారు. అనంతరం విఆర్‌సి సెంటర్‌లో రాస్తారోకో చేశారు. రిషితేశ్వరి మృతి చెంది 15 రోజులవుతున్నా ప్రభుత్వం సమగ్రంగా కేసు విచారణ చేయించడంలేదని విద్యార్థి నాయకులు పేర్కొన్నారు. ఈ ఘటనపై హై కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఉండగా, తమ కుమార్తె మృతి కేసును త్వరగా విచారించేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని, దోషులను శిక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును రిషితేశ్వరి తల్లిదండ్రులు మురళీకృష్ణ, దుర్గాభాయి కోరారు. విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో వారు చంద్రబాబును కలిశారు. విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్ లేకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మరోవైపు రిషితేశ్వరి మృతిపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ విచారణ శుక్రవారంతో ముగిసింది. మూడ్రోజులపాటు విద్యార్థులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, తల్లిదండ్రులు, వర్శిటీ అధికారులు, సిబ్బంది, రెవెన్యూ, పోలీసు అధికారులతో సమావేశమై పలు వివరాలు సేకరించారు. నివేదికను రెండ్రోజుల్లో పూర్తిచేసి ప్రభుత్వానికి అందిస్తామని కమిటీ ఛైర్మన్ బాలసుబ్రహ్మణ్యం చెప్పారు.
Next Story