Telugu Global
Others

కొత్త రాజ్యాంగం కోసం నేపాల్‌లో హ‌డావుడి  

భూకంప తాకిడితో తీవ్రంగా న‌ష్ట‌పోయిన నేపాల్ ప్ర‌జ‌లు ఇంకా పూర్తిస్థాయి జీవితాన్ని ప్రారంభించ‌లేదు. ల‌క్ష‌లాది మంది గుడారాల్లోనే నివ‌సిస్తూ ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. అయితే, నేపాల్ ప్ర‌జ‌ల దీనావ‌స్ధ‌ను ప్ర‌భుత్వం అవ‌కాశంగా తీసుకుంది. ప్ర‌ధాని సుశీలా కొయిరాలా ప్ర‌భుత్వం  కొత్త  రాజ్యాంగాన్ని అమ‌లు చేసే హ‌డావుడిలో ఉంది. మ‌హిళ‌ల హ‌క్కులు, వివ‌క్ష‌కు గురైన సామాజిక వ‌ర్గాలు, ద‌ళితుల ప్ర‌స్తావ‌న లేకుండా రూపొందించిన స‌రికొత్త రాజ్యాంగ ముసాయిదాను అధికారికంగా ఆమోదించుకోవ‌డానికి  ప్ర‌య‌త్నిస్తోంది. నేపాల్ ప్ర‌జ‌లు త‌మ జీవితాల‌ను పున‌ర్నిర్మించుకునే ప‌నుల్లో […]

భూకంప తాకిడితో తీవ్రంగా న‌ష్ట‌పోయిన నేపాల్ ప్ర‌జ‌లు ఇంకా పూర్తిస్థాయి జీవితాన్ని ప్రారంభించ‌లేదు. ల‌క్ష‌లాది మంది గుడారాల్లోనే నివ‌సిస్తూ ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. అయితే, నేపాల్ ప్ర‌జ‌ల దీనావ‌స్ధ‌ను ప్ర‌భుత్వం అవ‌కాశంగా తీసుకుంది. ప్ర‌ధాని సుశీలా కొయిరాలా ప్ర‌భుత్వం కొత్త రాజ్యాంగాన్ని అమ‌లు చేసే హ‌డావుడిలో ఉంది. మ‌హిళ‌ల హ‌క్కులు, వివ‌క్ష‌కు గురైన సామాజిక వ‌ర్గాలు, ద‌ళితుల ప్ర‌స్తావ‌న లేకుండా రూపొందించిన స‌రికొత్త రాజ్యాంగ ముసాయిదాను అధికారికంగా ఆమోదించుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. నేపాల్ ప్ర‌జ‌లు త‌మ జీవితాల‌ను పున‌ర్నిర్మించుకునే ప‌నుల్లో నిమ‌గ్న‌మై ఉంటే నేపాల్‌ ప్రభుత్వం మాత్రం లౌకిక స్పూర్తికి విరుద్ద‌ంగా నూత‌న రాజ్యాంగ అధికార ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని భావిస్తోంద‌ని మేధావులు ఆరోపిస్తున్నారు.

First Published:  31 July 2015 6:47 PM IST
Next Story