పవన్ సరసన కాజల్ ఫిక్స్ అయినట్టే..
పవన్ కొత్త సినిమా గబ్బర్ సింగ్-2కు సర్దార్ అనే పేరుపెట్టారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మొన్నటివరకు అనీషా ఆంబ్రోస్ పేరు వినిపించింది. ఈ విషయాన్ని పవన్ తో పాటు నిర్మాత కూడా కన్ ఫర్మ్ చేశాడు. అనీషా ఆంబ్రోస్ తో పవన్ దిగిన సెల్ఫీలు కూడా హల్ చల్ చేశాయి. కానీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ టైమ్ లో ఆంబ్రోస్ ను ప్రాజెక్ట్ నుంచి తప్పించేశారు. పవన్ సరసన మరో భామ కోసం […]
BY admin1 Aug 2015 12:35 AM IST

X
admin Updated On: 1 Aug 2015 5:44 AM IST
పవన్ కొత్త సినిమా గబ్బర్ సింగ్-2కు సర్దార్ అనే పేరుపెట్టారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మొన్నటివరకు అనీషా ఆంబ్రోస్ పేరు వినిపించింది. ఈ విషయాన్ని పవన్ తో పాటు నిర్మాత కూడా కన్ ఫర్మ్ చేశాడు. అనీషా ఆంబ్రోస్ తో పవన్ దిగిన సెల్ఫీలు కూడా హల్ చల్ చేశాయి. కానీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ టైమ్ లో ఆంబ్రోస్ ను ప్రాజెక్ట్ నుంచి తప్పించేశారు. పవన్ సరసన మరో భామ కోసం ఈమధ్యంతా వెదికారు. ఫైనల్ గా పవన్ సరసన హీరోయిన్ గా కాజల్ ను సెలక్ట్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ ప్రాజెక్ట్ అనుకున్న కొత్తలో, అంటే ఏడాదిన్నర కిందట కాజల్ నే హీరోయిన్ గా అనుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ పవన్-కాజల్ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. దీంతో ఫ్రెష్ గా ఉంటుందని మొదట కాజల్ నే అనుకున్నారు. కానీ ఆమె భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో అప్పట్లో వెనక్కి తగ్గారు. తాజాగా ఆమె తన రెమ్యునరేషన్ ను సవరించడంతో తిరిగి ఆమెనే ప్రాజెక్ట్ లోకి తీసుకునే ఆలోచనలో ఉన్నారు. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటిస్తారు.
Next Story