హోదా రాదని బాబుకు ముందే తెలుసు: జేసీ
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదనే విషయం చంద్రబాబుకు ఎప్పుడో తెలుసని, అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ దీనిపై స్పష్టమైన అవగాహన ఉందని, ఈ విషయంలో ప్రజలను మభ్య పెట్టాలని నేతలు చూస్తున్నారని అనంతపురం ఎంపీ జె.సి. దివాకరరెడ్డి అన్నారు. హోదా ఎలాగూ లేదని తెలిసినందునే ప్రత్యేక ప్యాకేజీ కోసం ఆయన చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలకు భినంగా వ్యవహరిస్తుందని, ప్రత్యేక హోదాపై తాము ఎన్నిసార్లు అడిగినా […]
BY admin1 Aug 2015 8:33 AM IST

X
admin Updated On: 1 Aug 2015 9:23 AM IST
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదనే విషయం చంద్రబాబుకు ఎప్పుడో తెలుసని, అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ దీనిపై స్పష్టమైన అవగాహన ఉందని, ఈ విషయంలో ప్రజలను మభ్య పెట్టాలని నేతలు చూస్తున్నారని అనంతపురం ఎంపీ జె.సి. దివాకరరెడ్డి అన్నారు. హోదా ఎలాగూ లేదని తెలిసినందునే ప్రత్యేక ప్యాకేజీ కోసం ఆయన చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలకు భినంగా వ్యవహరిస్తుందని, ప్రత్యేక హోదాపై తాము ఎన్నిసార్లు అడిగినా కేంద్రం దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ప్రజల మనోభిప్రాయాలకు, వారి మాటలకు ప్రభుత్వాలు విలువ ఇవ్వడం ఏనాడో మరిచిపోయాయని, అధికారం ఒక్కటే పరమావధిగా వ్యవహరిస్తున్నాయని, దీనివల్ల అధికారంలో ఉన్న పార్టీలకే నష్టమని దివాకర్‌రెడ్డి అన్నారు. ధర్నాలు, దీక్షలతో జగన్ మోసం చేస్తున్నారని, పవన్ కల్యాణ్ తన పనుల్లో నిమగ్నమై రాజకీయాన్ని వదిలేశారని దివాకర్‌రెడ్డి విమర్శించారు. పవన్ వీదుల్లోకి వచ్చి ప్రత్యేక హోదాపై ఉద్యమం చేస్తే తాము వెనక ఉండి నిడిపిస్తామని ఆయన అన్నారు.
Next Story