Telugu Global
Others

2022నాటికి జనాభాలో నెంబర్‌ ఒన్‌ భార‌త్

2022 నాటికి భార‌త‌దేశం ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభాగ‌ల దేశంగా రికార్డు నమోదు చేసే అవ‌కాశం ఉంద‌ని  ఐక్య‌రాజ్య‌స‌మితి తాజా నివేదిక‌లో వెల్ల‌డించింది. ప్ర‌పంచ జ‌నాభాలో అగ్ర‌స్ధానంలో ఉన్న చైనాను 2028 కంటే ముందే 2022లో అధిగ‌మిస్తుంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి 2015 స‌వ‌రించిన జ‌నాభా లెక్క‌ల నివేదిక అభిప్రాయ ప‌డింది. ప్ర‌స్తుతం భార‌త జ‌నాభా 131 కోట్లు ఉండ‌గా, చైనా జ‌నాభా 138 కోట్లు. ఏడు సంవ‌త్స‌రాల‌లో  రెండు దేశాల్లోని జ‌నాభా 1.4బిలియ‌న్ల‌కు  చేరుతుంద‌ని నివేదిక తెలిపింది.  భార‌త్ జ‌నాభా […]

2022 నాటికి భార‌త‌దేశం ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభాగ‌ల దేశంగా రికార్డు నమోదు చేసే అవ‌కాశం ఉంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి తాజా నివేదిక‌లో వెల్ల‌డించింది. ప్ర‌పంచ జ‌నాభాలో అగ్ర‌స్ధానంలో ఉన్న చైనాను 2028 కంటే ముందే 2022లో అధిగ‌మిస్తుంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి 2015 స‌వ‌రించిన జ‌నాభా లెక్క‌ల నివేదిక అభిప్రాయ ప‌డింది. ప్ర‌స్తుతం భార‌త జ‌నాభా 131 కోట్లు ఉండ‌గా, చైనా జ‌నాభా 138 కోట్లు. ఏడు సంవ‌త్స‌రాల‌లో రెండు దేశాల్లోని జ‌నాభా 1.4బిలియ‌న్ల‌కు చేరుతుంద‌ని నివేదిక తెలిపింది. భార‌త్ జ‌నాభా వేగంగా పెరుగుతోంటే, చైనా జ‌నాభా పెరుగుద‌ల కాస్త మంద‌కొండిగా ఉంది. దీంతో 2020నాటికి భార‌త్ జ‌నాభా సంఖ్య‌లో అగ్ర‌స్ధానానికి చేరుకుంటుంది. 2030 నాటికి భార‌త జ‌నాభా 150 కోట్లు, 2050 నాటికి 170 కోట్లకు చేరుకుంటుంద‌ని ఐరాస అంచనా వేస్తోంది.

First Published:  31 July 2015 6:46 PM IST
Next Story