బాలికల మోడల్ స్కూళ్లలో వంద హాస్టళ్లు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 192 మోడల్ స్కూళ్లలో బాలికల కోసం వంద హాస్టళ్లను నిర్మిస్తున్నామని, వాటిలో 89 హాస్టళ్ల నిర్మాణం పూర్తి కావస్తోందని, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఈ హాస్టళ్లన్నింటినీ వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేస్తామని శ్రీహరి వెల్లడించారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, మోడల్ స్కూళ్లు, అందులో బాలికల హాస్టళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల నిర్మాణ పనులను, జూనియర్ కాలేజ్, డిగ్రీకాలేజ్ పనులను ఆయన విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో […]
BY admin1 Aug 2015 7:53 AM IST
X
admin Updated On: 1 Aug 2015 7:53 AM IST
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 192 మోడల్ స్కూళ్లలో బాలికల కోసం వంద హాస్టళ్లను నిర్మిస్తున్నామని, వాటిలో 89 హాస్టళ్ల నిర్మాణం పూర్తి కావస్తోందని, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఈ హాస్టళ్లన్నింటినీ వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేస్తామని శ్రీహరి వెల్లడించారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, మోడల్ స్కూళ్లు, అందులో బాలికల హాస్టళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల నిర్మాణ పనులను, జూనియర్ కాలేజ్, డిగ్రీకాలేజ్ పనులను ఆయన విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 1,500 కోట్లతో నిర్మిస్తున్న మోడల్ స్కూళ్లలో బాలికల హాస్టళ్ల నిర్మాణంపై మంత్రి ఆరా తీశారు. వాటిలో 89 హాస్టళ్ల నిర్మాణం తుదిదశకు చేరుకుందని, మిగిలినవి కూడా త్వరలో పూర్తి కానున్నాయని అధికారులు తెలిపారు. మోడల్ స్కూళ్ల హాస్టళ్ల భద్రత కోసం వాచ్‌మెన్‌ను నియమిస్తామని, వార్డెన్లకు అదనంగా రూ. 5 వేలు గౌరవ వేతనం చెల్లిస్తామని ఆయన చెప్పారు.
Next Story