Telugu Global
Others

మళ్ళీ తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

వాహనదారులకు శుభవార్త. పెట్రోలు, డీజిల్‌ రేట్లు మళ్లీ తగ్గాయి. లీటర్ పెట్రోల్‌పై రూ.2.43, డీజిల్‌పై రూ.3.60 తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే నాన్ సబ్సిడీ గ్యాస్ (14.2 కేజీలు) ధరను రూ. 23.50 లకు తగ్గించారు. కొత్త రేట్లు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయని ఆయిల్‌ కంపెనీలు స్పష్టం చేశాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీ మార్కెట్లో లీటరు పెట్రోల్ ధర రూ.66.90 నుంచి రూ.64.47కు, డీజిల్ రేటు రూ.49.72 నుంచి రూ.46.12కు జారుకుంది. ఆయా రాష్ట్ర […]

మళ్ళీ తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
X
వాహనదారులకు శుభవార్త. పెట్రోలు, డీజిల్‌ రేట్లు మళ్లీ తగ్గాయి. లీటర్ పెట్రోల్‌పై రూ.2.43, డీజిల్‌పై రూ.3.60 తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే నాన్ సబ్సిడీ గ్యాస్ (14.2 కేజీలు) ధరను రూ. 23.50 లకు తగ్గించారు. కొత్త రేట్లు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయని ఆయిల్‌ కంపెనీలు స్పష్టం చేశాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీ మార్కెట్లో లీటరు పెట్రోల్ ధర రూ.66.90 నుంచి రూ.64.47కు, డీజిల్ రేటు రూ.49.72 నుంచి రూ.46.12కు జారుకుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించే స్థానిక పన్నుల ఆధారంగా ఇంధన రేట్ల తగ్గింపు నగరాన్ని బట్టి మారుతుంటుంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌పై రూ.2.69, డీజిల్‌పై రూ.4.04 తగ్గింది. దీంతో మార్కెట్లో పెట్రోల్ రూ.72.52 నుంచి రూ.69.83కు, డీజిల్ రూ.54.24 నుంచి రూ.50.20కు చేరుకుంది. జూలైలో పెట్రో ఉత్పత్తుల రేట్లు తగ్గడం ఇది మూడోసారి.
First Published:  31 July 2015 6:35 PM IST
Next Story