గోడలో పాము (Devotional)
రబ్బీ అకివా జ్ఞానవంతుడు. విచక్షణ తెలిసిన వాడు. జనాలకు మంచి చెడ్డలు వివరించేవాడు. ఆయనకు ఒక కూతురు ఉంది. ఆ అమ్మాయికి ఆయన పెళ్ళి సంబంధం కుదిర్చాడు. అయితే ఒక జ్యోతిష్కుడు ఆ అమ్మాయి ఎప్పుడు పెళ్ళి మంటపంలో అడుగుపెడుతుందో అప్పుడే పాము ఈ అమ్మాయిని కాటు వేస్తుంది. ఆ క్షణమే ఈ అమ్మాయి కన్ను మూస్తుంది అని చెప్పాడు. రబ్బీ అకివా దైవంపట్ల నమ్మకం ఉన్నవాడు. అందువల్ల భారమంతా భగవంతుని మీద వేసి పెళ్ళి పనుల్లో […]
రబ్బీ అకివా జ్ఞానవంతుడు. విచక్షణ తెలిసిన వాడు. జనాలకు మంచి చెడ్డలు వివరించేవాడు. ఆయనకు ఒక కూతురు ఉంది. ఆ అమ్మాయికి ఆయన పెళ్ళి సంబంధం కుదిర్చాడు.
అయితే ఒక జ్యోతిష్కుడు ఆ అమ్మాయి ఎప్పుడు పెళ్ళి మంటపంలో అడుగుపెడుతుందో అప్పుడే పాము ఈ అమ్మాయిని కాటు వేస్తుంది. ఆ క్షణమే ఈ అమ్మాయి కన్ను మూస్తుంది అని చెప్పాడు.
రబ్బీ అకివా దైవంపట్ల నమ్మకం ఉన్నవాడు. అందువల్ల భారమంతా భగవంతుని మీద వేసి పెళ్ళి పనుల్లో మునిగిపోయాడు.
ఇల్లంతా హడావుడిగా ఉంది. బంధువులంతావచ్చారు. ఇటు అటూ తిరుగుతున్నారు. పెళ్ళికూతురు ఒక్కతే పెళ్ళిమంటపంలోకి వెళ్ళింది. తల దువ్వుకున్నది. అలంకరించిన మంటపాన్ని అటూఇటూ చూసింది. తలలో పేలులాగే పట్టకారలాంటి దాన్ని పక్కనే ఉన్న గోడరంధ్రంలో గుచ్చింది. ఆ సంగతి మరచిపోయింది. మరుసటిరోజు ఆ పట్టకారను లాగితే అది గుచ్చినప్పుడు ఒకపాము కంట్లో గుచ్చుకుని పాము చనిపోయింది. లాగితే దాంతోబాటు పామువచ్చింది.
పెళ్ళి యథావిథిగా, వైభవంగా జరిగింది. ఎట్లాంటి ఆటంకం, ప్రమాదం లేకుండా జరిగిపోయింది.
రబ్బీ అకివా ఆశ్చర్యపోయి కూతుర్ని పిలిచి “అమ్మా! నిన్న ఏదయినా ఒక సంఘటన జరిగిందా” అని అడిగాడు.
ఆ అమ్మాయి “నాన్నా! నిన్న సాయంత్రం ఒక పేదవాడు ఇంటిదగ్గరకు వచ్చి బిచ్చమడిగాడు. అందరూ పెళ్ళి పనుల్లో మునిగివున్నారు. ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. అందుకనే నేను వెళ్ళి అతనికి బిచ్చంవేశాను. పైగా అప్పుడు అతనికి పెట్టడానికి వేరు అన్నం లేదు. నాకోసం అట్టిపెట్టిన అన్నాన్ని అతనికి ఇచ్చాను” అంది. అట్లాగే గోడలో పాము సంగతీ చెప్పింది.
రబ్బీ అకివా అంతా విని నిట్టూర్చాడు. జరిగినమంచికి దైవానికి కృతజ్ఞత తెలుపుకున్నాడు. తరువాత “ధర్మం మరణంనించీ మనిషిని బయటపడేలా చేస్తుంది. కేవలం అసహజమరణంనించేకాదు, సహజమరణంనించి కూడా” అన్నాడు.
– సౌభాగ్య