మంచి సినిమాకు ఉండే పవర్ అది...!
సినిమాలు సమాజాన్ని మార్చుతాయ..? మానవ సమాజాన్ని ప్రభావితం చేస్తాయా..? ఇది ఒక వర్గం విమర్శకులు నుంచి వినిపించే వాయిస్. మంచి చిత్రాలు మానవ సమాజం పై మంచి ప్రభావాన్ని చూపుతాయి. సినిమా శక్తి అనంతం అని గట్టిగా చెబుతారు మరో వర్గం. ఎవరేమన్న.. మంచి సినిమాలకు మనుషుల్ని ప్రభావితం చేసే శక్తి వుంటుంది. తాజాగా మన టాలీవుడ్ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన `బజరంగి భాయిజాన్` చిత్రం ఇండియా, పాకిస్తాన్ లో విజయవంతంగా నడుస్తుంది. అంతే […]

సినిమాలు సమాజాన్ని మార్చుతాయ..? మానవ సమాజాన్ని ప్రభావితం చేస్తాయా..? ఇది ఒక వర్గం విమర్శకులు నుంచి వినిపించే వాయిస్. మంచి చిత్రాలు మానవ సమాజం పై మంచి ప్రభావాన్ని చూపుతాయి. సినిమా శక్తి అనంతం అని గట్టిగా చెబుతారు మరో వర్గం. ఎవరేమన్న.. మంచి సినిమాలకు మనుషుల్ని ప్రభావితం చేసే శక్తి వుంటుంది. తాజాగా మన టాలీవుడ్ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన 'బజరంగి భాయిజాన్' చిత్రం ఇండియా, పాకిస్తాన్ లో విజయవంతంగా నడుస్తుంది. అంతే కాదు చాల మందిని ఆలోచింప చేస్తుంది. పాకిస్తాన్ లో ఈ సినిమా చూసిన తరువాత.. అక్కడ రైట్ వింగ్ ఉద్యమ కారులు మరింత ప్రేరణ పొందారట.
మానవత్వానికి మించినది లేదు.. మనవాత్వానికి రంగు రుచి వాసన లేదు అని చాటిన చిత్రం. సల్మాన్ ఖాన్ లీడ్ రోల్ చేశారు. ఈ చిత్రంతో ప్రేరణ పొందిన పాకిస్తాన్ లో రైట్ వింగ్ ఉద్యమ కారులు..అక్కడ మూగ, చెవుడు సమస్యలతో బాధ పడుతున్న భారతీయ మహిళలకు ట్రీట్ మెంట్ ఉచితంగా చేయిస్తున్నారట. పొలిటికల్ గా ఇండియా , పాకిస్తాన్ ల మధ్య ఏ విధమైన వాతావరణం ఉంటుందో తెలిసిందే. మొత్తం మీద బజరంగి బాయిజాన్ అన్నింటిని అధిక మించి పాకిస్తానియుల మనుసు గెలవడం విశేషం. మానవత్వానికి ఉండే శక్తి అది. హట్యాఫ్ టు బజరంగి భాయిజాన్ ఎంటైర్ టీమ్.