ట్యాపింగ్‌లో కేసీఆర్ ప్రభుత్వం పతనం: రావెల
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా ఇరుక్కు పోయిందని, ఆ ప్రభుత్వం పతనం కాక తప్పదని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. అనైతికంగా, చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడటం అనైతికమన్నారు. ఏ దురుద్దేశ్యంతో తెలంగాణా ప్రభుత్వం కుట్ర చేసిందో, అదే కుట్రలో ఇరుక్కుని ఆ సర్కారే పతనం అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యమ్రంతి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తుంటే.. దానిని […]
BY Pragnadhar Reddy31 July 2015 6:40 PM IST
Pragnadhar Reddy Updated On: 1 Aug 2015 5:29 AM IST
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా ఇరుక్కు పోయిందని, ఆ ప్రభుత్వం పతనం కాక తప్పదని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. అనైతికంగా, చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడటం అనైతికమన్నారు. ఏ దురుద్దేశ్యంతో తెలంగాణా ప్రభుత్వం కుట్ర చేసిందో, అదే కుట్రలో ఇరుక్కుని ఆ సర్కారే పతనం అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యమ్రంతి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తుంటే.. దానిని అడ్డుకోవటానికి కుట్రలో భాగంగానే కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తీసుకు వచ్చాడని దుయ్యబట్టారు. అవసరమైనపుడు ఈ కేసులో ఉన్న ఐపీఎస్‌ల పేర్లను కూడా బయట పెడతామని ఒక ప్రశ్నకు సమాధానంగా రావెల చెప్పారు.
Next Story