లీటరు మంచినీళ్ల ధరకే మద్యం!
రాష్ట్రంలో గుడుంబా ద్వారా జరుగుతున్న దుష్పరిణామాలను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం అతిచౌక మద్యంను అందుబాటులోకి తీసుకురానుంది. లీటరు మంచినీళ్ల ధర రూ. 15కే మద్యాన్ని విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 90 మి.లీటర్లు ఉండే ఈ మద్యంను రాష్ట్రంలోని పల్లెపల్లెలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త మద్యం పాలసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. కల్లీ కల్లును నివారించడానికి చెరువుల గట్లపై ఈత చెట్లు, తాటి చెట్ల పెంపకాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల […]
BY admin31 July 2015 6:49 PM IST
admin Updated On: 1 Aug 2015 7:07 AM IST
రాష్ట్రంలో గుడుంబా ద్వారా జరుగుతున్న దుష్పరిణామాలను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం అతిచౌక మద్యంను అందుబాటులోకి తీసుకురానుంది. లీటరు మంచినీళ్ల ధర రూ. 15కే మద్యాన్ని విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 90 మి.లీటర్లు ఉండే ఈ మద్యంను రాష్ట్రంలోని పల్లెపల్లెలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త మద్యం పాలసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. కల్లీ కల్లును నివారించడానికి చెరువుల గట్లపై ఈత చెట్లు, తాటి చెట్ల పెంపకాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ప్రజలకు స్వచ్ఛమైన కల్తీకల్లు సరఫరా చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
Next Story