పూర్తయిన రిషితేశ్వరి మృతిపై విచారణ
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ర్యాగింగ్ రక్కసికి బలైన విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై ప్రభుత్వం నియమించిన విచారణకు కమిటీ తన దర్యాప్తును పూర్తి చేసింది. మూడు రోజులపాటు విశ్వవిద్యాలయంలోనే ఉండి వివరాలు సేకరించిన ఈ కమిటీ అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించింది. ఈ కేసులో విచారణ పూర్తయిందని విచారణ కమిటీ చైర్మన్ బాలసుబ్రమణ్యం మీడియాకు తెలిపారు. అందుబాటులో లేని విద్యార్థుల అభిప్రాయాలను కూడా సేకరించమని ప్రభుత్వం కోరితే మరోసారి విచారణ జరుపుతామని ఆయన అన్నారు. లేకపోతే […]
BY admin30 July 2015 1:27 PM GMT
X
admin Updated On: 31 July 2015 5:30 AM GMT
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ర్యాగింగ్ రక్కసికి బలైన విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై ప్రభుత్వం నియమించిన విచారణకు కమిటీ తన దర్యాప్తును పూర్తి చేసింది. మూడు రోజులపాటు విశ్వవిద్యాలయంలోనే ఉండి వివరాలు సేకరించిన ఈ కమిటీ అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించింది. ఈ కేసులో విచారణ పూర్తయిందని విచారణ కమిటీ చైర్మన్ బాలసుబ్రమణ్యం మీడియాకు తెలిపారు. అందుబాటులో లేని విద్యార్థుల అభిప్రాయాలను కూడా సేకరించమని ప్రభుత్వం కోరితే మరోసారి విచారణ జరుపుతామని ఆయన అన్నారు. లేకపోతే రెండ్రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు
Next Story