పోస్టులో గంగాజలం
కార్డులు, ఉత్తరాలే కాదండోయ్ కోరుకుంటే గంగాజలాన్ని కూడా పోస్టల్ శాఖ మనకు బట్వాడా చేస్తుంది. అదెలా అనుకుంటున్నారా! ఇకపై కోరుకున్నవారికి గంగాజలాన్ని సీసాల్లో ఇంటింటికీ అందించే పథకానికి తపాలాశాఖ శ్రీకారం చుడుతోంది. శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసిన నీటిని ఆర్డర్‌పై సరఫరా చేస్తుంది. ఇందుకోసం ఉత్తరాఖండ్‌లో బ్లాటింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ పథకానికి గోదావారి పుష్కరాలే ప్రేరణ అట. గోదావరి పుష్కరాల సమయంలో తపాలశాఖ గోదావరి నీటిని శుద్ధి చేసి గాడ్ జల్ పేరుతో […]
BY Pragnadhar Reddy30 July 2015 6:42 PM IST
Pragnadhar Reddy Updated On: 31 July 2015 6:48 AM IST
కార్డులు, ఉత్తరాలే కాదండోయ్ కోరుకుంటే గంగాజలాన్ని కూడా పోస్టల్ శాఖ మనకు బట్వాడా చేస్తుంది. అదెలా అనుకుంటున్నారా! ఇకపై కోరుకున్నవారికి గంగాజలాన్ని సీసాల్లో ఇంటింటికీ అందించే పథకానికి తపాలాశాఖ శ్రీకారం చుడుతోంది. శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసిన నీటిని ఆర్డర్‌పై సరఫరా చేస్తుంది. ఇందుకోసం ఉత్తరాఖండ్‌లో బ్లాటింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ పథకానికి గోదావారి పుష్కరాలే ప్రేరణ అట. గోదావరి పుష్కరాల సమయంలో తపాలశాఖ గోదావరి నీటిని శుద్ధి చేసి గాడ్ జల్ పేరుతో పుష్కరాలకు పోలేని వారికి అందించింది. ఈ పథకం సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా గంగాజలాన్ని ఇంటింటికీ సరఫరా చేయాలని నిర్ణయించింది.
Next Story