Telugu Global
Others

తెలంగాణలో 2 ఫార్మా కంపెనీల సీజ్‌

తెలంగాణలోని మందుల తయారీ కంపెనీల్లో ఔషధ నియంత్రణ మండలి అధికారుల సోదాలు నిర్వహించారు. అవకతవకలు జరుగుతున్నాయని భావించిన 22 ఫార్మా కంపెనీలకు షోకాజు నోటీసులు అందజేశారు. రెండు కంపెనీలను సీజ్ చేశారు. ఈ తనిఖీలకు‌ డ్రగ్‌ కంట్రోల్‌ డీజీ అకున్‌ సబర్వాల్‌ నేతృత్వం వహించారు. చట్టాన్ని అతిక్రమించి మందులు తయారీ చేస్తే ఎవరైనా తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీలు ఇంతటితో అయిపోలేదని దశలవారీగా మళ్ళీ మళ్ళీ జరుపుతూనే ఉంటామని ఆయన తెలిపారు.

First Published:  30 July 2015 6:55 PM IST
Next Story