మోదీ సెల్ఫ్ ఇంట్రెస్ట్‌తోనే స్మృతీకి పదవి
కేంద్ర హెచ్ఆర్డీ మంత్రిత్వశాఖను నిర్వహించడానికి స్మృతీ ఇరానీకి ఉన్న అర్హత ఏమిటని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గురుదాస్ కామత్. ప్రధాని నరేంద్రమోదీ సెల్ఫ్ ఇంట్రెస్ట్‌తోనే స్మృతీ ఇరానీ కేంద్రమంత్రివర్గంలోకి వచ్చారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పదో తరగతి చదివిన స్మృతీ ఇరానీని మోదీ వ్యక్తిగత శ్రద్ధతో హెచ్ఆర్డీ మంత్రిని చేశారని కామెంట్ చేశారు. మోదీకి టీవీ సీరియల్స్‌తోనే సరిపోతోందిః రాజస్థాన్‌లోని భిల్వారా బహిరంగ సభలో ప్రసంగించిన కామత్., కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా […]
కేంద్ర హెచ్ఆర్డీ మంత్రిత్వశాఖను నిర్వహించడానికి స్మృతీ ఇరానీకి ఉన్న అర్హత ఏమిటని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గురుదాస్ కామత్. ప్రధాని నరేంద్రమోదీ సెల్ఫ్ ఇంట్రెస్ట్‌తోనే స్మృతీ ఇరానీ కేంద్రమంత్రివర్గంలోకి వచ్చారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పదో తరగతి చదివిన స్మృతీ ఇరానీని మోదీ వ్యక్తిగత శ్రద్ధతో హెచ్ఆర్డీ మంత్రిని చేశారని కామెంట్ చేశారు.
మోదీకి టీవీ సీరియల్స్‌తోనే సరిపోతోందిః
రాజస్థాన్‌లోని భిల్వారా బహిరంగ సభలో ప్రసంగించిన కామత్., కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా స్మృతీ ఇరానీని మోదీ ఎలా ఎంపిక చేశారని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి టీవీ సీరియల్స్‌పై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని సెటైర్ విసిరారు.రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆయన గాలికొదిలేసి కెమెరాల ముందు పోజులిస్తున్నారని విమర్శించారు.
స్మృతీ ఇరానీ టేబుల్స్ క్లీన్ చేసేదిః
గురుదాస్ కామత్ ఇంతటితో ఆగలేదు. స్మృతీ ఇరానీపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. మోడలింగ్‌లోకి రాకముందు ఆమె ముంబై ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో పనిచేసేదన్నారు. కేవలం టెన్త్‌ప్యాస్ అయిన స్మృతి ఇరానీ., హోటల్లో టేబుల్స్ క్లీన్ చేసేదని ఎద్దేవ చేశారు. టీవీ సీరియల్స్ పుణ్యమాని ఆమెకు స్టార్‌డమ్ వచ్చిందన్నారు కామత్.
మోదీ హిట్లర్ః
అధికారంలోకి రాగానే మోదీ హిట్లర్‌లా మారిపోయారని ఆరోపించారు రాజస్థాన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ కూడా అయిన గురుదాస్ కామత్. హెచ్ఆర్డీ వంటి కీలక శాఖకు అంతగా చదువుకోని స్మృతీ ఇరానీని ఎంపికచేయడంపై బీజేపీ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తంచేసినా..మోదీ లెక్కచేయలేదన్నారు. స్మృతీ ఇరానీని హెచ్ఆర్డీ మంత్రిని చేయడంపై దేశానికి మోదీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.