Telugu Global
Others

ప్రత్యేక హోదాపై ప్రయత్నిస్తూనే ఉందాం: కేబినెట్‌

ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, ప్రత్యేక హోదాపై మన ప్రయత్నం కొనసాగిద్దామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హోదాపై హామీ ఇచ్చినప్పటికీ దానిని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంపై ఉంటుందని కేబినెట్‌ అభిప్రాయపడింది. తొలిసారిగా శుక్రవారం విజయవాడలో ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. సుమారు ఎనిమిదిన్నర గంటలకు పైగా జరిగిన ఈ సమావేశం వివరాలను ఆర్థిక మంత్రి […]

ప్రత్యేక హోదాపై ప్రయత్నిస్తూనే ఉందాం: కేబినెట్‌
X

ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, ప్రత్యేక హోదాపై మన ప్రయత్నం కొనసాగిద్దామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హోదాపై హామీ ఇచ్చినప్పటికీ దానిని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంపై ఉంటుందని కేబినెట్‌ అభిప్రాయపడింది. తొలిసారిగా శుక్రవారం విజయవాడలో ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. సుమారు ఎనిమిదిన్నర గంటలకు పైగా జరిగిన ఈ సమావేశం వివరాలను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాకు చెప్పారు. ప్రత్యేక హోదాపై చట్టంలో లేకున్నా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ హామీ ఇచ్చారని, ప్రతిపక్ష బీజేపీ కూడా దాన్ని సమర్ధించిందని యనమల చెప్పారు. 14వ ఆర్థిక సంఘాన్ని కూడా హోదా కల్పనలో సహకరించాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. అయినా కేంద్రమంత్రి చేసిన ప్రకటన కొత్తగా ఏర్పడిన ఏపీకి వర్తించదని, దేశంలోని మిగతా రాష్ట్రాల డిమాండ్లని దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ ప్రకటన చేశారని యనమల విశ్లేషించారు. ఏపీకి ఉన్న ఇబ్బందులు అన్నీ కేంద్రానికి తెలుసని, అందుచేత ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో తలపడడం వల్ల ప్రయోజనం కూడా లేదని, మంచితనంతోనే పని పూర్తి చేసుకోవాలని, నిధులను తెచ్చుకోవాలని కేబినెట్‌ అభిప్రాయపడినట్టు ఆయన చెప్పారు. కాగా ప్రత్యేకహోదాపై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే హక్కు లేదని కొంతమంది మంత్రులు అభిప్రాయాయపడినట్టు తెలిసింది. అయితే ఈ అభిప్రాయంతో ఆర్ధిక మంత్రి యనమల విభేదించారు. జగన్‌ తన ప్రయత్నం ఏదో తను చేయడం వల్ల మనకు నష్టం లేదు కదా… రాష్ట్రానికి జరిగేది మేలే కదా అంటూ అడ్డు పడ్డారని తెలిసింది.

శాఖల తరలింపునకు సీఎం ఆదేశం
ప్రజలతో సంబంధమున్న శాఖలను తక్షణం అమరావతికి తరలించాలని చంద్రబాబు ఆదేశించినట్టు యనమల తెలిపారు. యనమల మాటల్లో… అమరావతిలో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున చట్టం తన పని తాను చేసుకుపోతుందని చంద్రబాబు మంత్రులతో అన్నారు. ఈ సందర్భంగా కేబినేట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

రితికేశ్వరి తల్లిదండ్రులకు పది లక్షల పరిహారం
రితికేశ్వరి మృతిపై దర్యాప్తును వేగవంతం చేయాలని, పరిహారంగా ఆమె తల్లిదండ్రులకు పది లక్షల రూపాయలను ఇవ్వాలని, రాజమండ్రిలో ఓ స్థలాన్ని కూడా ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్టు యనమల తెలిపారు. జాతికి అబ్దుల్‌ కలాం చేసిన సేవలను కేబినెట్‌ కొనియాడింది. ఆయన పేరుతో నాగార్జున విశ్వవిద్యాలయంలో కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, ఒంగోలులో ఏర్పాటు కాబోతున్న ట్రిపుల్‌ ఐటికి అబ్దుల్‌ కలాం పేరు పెట్టాలని, కలాం పేరుతో విద్యార్ధులకు పురస్కారాలను కూడా ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. కలాం మృతికి సంతాపం వ్యక్తం చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విశ్వ‌విద్యాల‌యాల్లో ఇక విద్యార్థి సంఘాల మాట వినిపించ‌దు. యూనివర్శిటీల్లో సంఘాలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది. యూనివర్శిటీ ప్రాంగణంలో నినాదాలు చేసినా కఠినచర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రివ‌ర్గం తీర్మానించింది

పేదలకు 2.75 లక్షల గృహాల నిర్మాణం
ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్రంలో విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించినట్టు యనమల తెలిపారు. పేదలకు గృహ నిర్మాణంపై కూడా దృష్టి పెట్టినట్టు యనమల చెప్పారు. బడుగు బలహీనవర్గాలకు రెండు లక్షల 75 వేల ఇళ్ళను నిర్మించాలని, ఒక్కో ఇంటికి రెండున్నర లక్షల రూపాయల ఖర్చు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. విశాఖకు రైల్వే జోన్‌లపై వచ్చే వరకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండాలని, కేంద్రంతో నిరంతరం సంప్రదిస్తూనే ఉండాలని చంద్రబాబు సూచించారు. 2018నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. పట్టిసీమ మొదటి దశను ఆగస్టు 15న ప్రారంభించాలని నిర్ణయించినట్టు చెప్పారు. పెరిగిపోతున్న ఉల్లిపాయల ధర మీద కూడా కేబినెట్‌ దృష్టి సారించినట్టు యనమల తెలిపారు. కిలో 20 రూపాయల స్థాయికి తేవడానికి ప్రయత్నించాలని, అప్పటివరకు ప్రభుత్వమే రైతు బజార్ల ద్వారా కిలో 20 రూపాయలకు అందజేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు చెప్పారు.

First Published:  31 July 2015 2:42 PM IST
Next Story