ఆగస్ట్ 3 నుంచి సీరియల్ కష్టాలు?
వెండితెర కంటే ఘనంగా వెలిగిపోతోంది బుల్లితెర. సీరియల్స్ ఎంత ప్రజాదరణ పొందాయో ..వాటిని రూపొందిస్తున్న కార్మికులు అంత నిరాదరణకు గురయ్యారు. దీనికితోడు డబ్బింగ్ సీరియళ్లతో తమ పొట్టకొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు. వేతన సవరణ, డబ్బింగ్ సీరియళ్లపై నియంత్రణ, పనిగంటల కుదింపు వంటి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కాక మీదున్న కార్మికులు నిరసనకు దిగుతున్నారు. ఆగస్టు 3వ తేదీ నుంచి షూటింగ్‌లకు గైర్హాజరవుతున్నామని ప్రకటించారు. వేతనాలు పెంచాలంటూ […]
BY sarvi29 July 2015 7:42 PM GMT
X
sarvi Updated On: 30 July 2015 1:50 AM GMT
వెండితెర కంటే ఘనంగా వెలిగిపోతోంది బుల్లితెర. సీరియల్స్ ఎంత ప్రజాదరణ పొందాయో ..వాటిని రూపొందిస్తున్న కార్మికులు అంత నిరాదరణకు గురయ్యారు. దీనికితోడు డబ్బింగ్ సీరియళ్లతో తమ పొట్టకొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు. వేతన సవరణ, డబ్బింగ్ సీరియళ్లపై నియంత్రణ, పనిగంటల కుదింపు వంటి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కాక మీదున్న కార్మికులు నిరసనకు దిగుతున్నారు. ఆగస్టు 3వ తేదీ నుంచి షూటింగ్‌లకు గైర్హాజరవుతున్నామని ప్రకటించారు. వేతనాలు పెంచాలంటూ తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ను కోరినా పట్టించుకోకపోవడంతో తప్పనిసరై సహాయ నిరాకరణ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు సంఘ ప్రతినిధులు. టీవీ కార్మికులకు 20 ఏళ్ల నుంచి వేతన సవరణ లేదని, కార్మికులు రోజుకు 16 నుంచి 18 గంటల పాటు పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ చైర్మన్ మేచినేని శ్రీనివాస రావు. డబ్బింగ్ సీరియల్స్, ఇతర భాషల ఆర్టిస్టుల తమకు ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయని ఆరోపిస్తున్నారు. టెలివిజన్ టెక్నీషియన్స్ సమ్మె ఓ వారంరోజులపాటు కొనసాగితే…సీరియళ్లు, ఇతర ప్రోగ్రాంలు నిలిచిపోయే అవకాశం ఉంది.
Next Story