రుద్రమదేవిని భయపెడుతున్న రొమాన్స్
చారిత్రక కథాంశంతో తెరకెక్కింది రుద్రమదేవి సినిమా. తాజాగా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడో అంశం రుద్రమదేవి టీమ్ ను ఇరకాటంలో పడేసింది. అదే సినిమాలో వచ్చే ఓ రొమాంటిక్ సాంగ్. సినిమాలో రుద్రమదేవి పాత్ర పోషించిన అనుష్కపై ఓ కిక్కెక్కించే రొమాంటిక్ సాంగ్ పిక్చరైజ్ చేశాడు గుణశేఖర్. అవునా.. నీవేనా.. అనే బాణీతో సాగే ఈ పాటను ఇళయరాజా స్వరపరిచాడు. పాట కూడా విజువల్ ఫీస్ట్ గా వచ్చింది. కానీ ఇప్పుడిదే పాట […]
BY admin30 July 2015 12:30 AM IST

X
admin Updated On: 30 July 2015 5:55 AM IST
చారిత్రక కథాంశంతో తెరకెక్కింది రుద్రమదేవి సినిమా. తాజాగా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడో అంశం రుద్రమదేవి టీమ్ ను ఇరకాటంలో పడేసింది. అదే సినిమాలో వచ్చే ఓ రొమాంటిక్ సాంగ్. సినిమాలో రుద్రమదేవి పాత్ర పోషించిన అనుష్కపై ఓ కిక్కెక్కించే రొమాంటిక్ సాంగ్ పిక్చరైజ్ చేశాడు గుణశేఖర్. అవునా.. నీవేనా.. అనే బాణీతో సాగే ఈ పాటను ఇళయరాజా స్వరపరిచాడు. పాట కూడా విజువల్ ఫీస్ట్ గా వచ్చింది. కానీ ఇప్పుడిదే పాట రుద్రమదేవి సినిమాను వివాదాల్లోకి నెడుతుందేమో అని భయపడుతున్నాడు గుణశేఖర్. చారిత్రక కథాంశంతో తెరకెక్కిన సినిమాలో రొమాంటిక్ సాంగ్ పెడితే చరిత్రకారులు, సాహితీవేత్తలు ఒప్పుకుంటారా అనేది గుణశేఖర్ డౌట్. తాజాగా బాహుబలి సినిమాలో తమన్నాపై తీసిన ఓ రొమాంటిక్ సాంగ్ కూడా వివాదాస్పదమైంది. గతంలో అన్నమయ్య లాంటి సినిమాలో మోహన్ బాబుపై తీసిన ఎరోటిక్ సాంగ్ కూడా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవిపై రొమాంటిక్ సాంగ్ అంటే అది కచ్చితంగా వివాదాలు సృష్టిస్తుందంటున్నారు విశ్లేషకులు. పైగా తెలంగాణ అంశంతో ముడిపడిన వ్యవహారం కాబట్టి గుణశేఖర్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటే బెటరని సలహా ఇస్తున్నారు.
Next Story