మెమన్ అంత్యక్రియలు పూర్తి
ముంబయి బాంబు పేలుళ్ళ కేసులో ఉరిశిక్షకు గురైన యాకుబ్ మెమన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. దక్షిణ ముంబయిలో మెరైన్ లైన్స్ ప్రాంతంలో బదా కబరస్థాన్ శ్మశాన వాటికలో సాయంత్రం 5.15 గంటలకు ముస్లిం మతానుసారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన్ని కూడా అతని తండ్రి సమాధి వద్దే ఖననం చేశారు. నాగపూర్ సెంట్రల్ జైల్లో గురువారం ఉదయం 6.45 నిమషాలకు అతన్ని ఉరి తీసిన తర్వాత నాగపూర్ నుంచి ఈ మధ్యాహ్నం మెమన్ భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో ముంబయికి తరలించారు. […]
ముంబయి బాంబు పేలుళ్ళ కేసులో ఉరిశిక్షకు గురైన యాకుబ్ మెమన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. దక్షిణ ముంబయిలో మెరైన్ లైన్స్ ప్రాంతంలో బదా కబరస్థాన్ శ్మశాన వాటికలో సాయంత్రం 5.15 గంటలకు ముస్లిం మతానుసారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన్ని కూడా అతని తండ్రి సమాధి వద్దే ఖననం చేశారు. నాగపూర్ సెంట్రల్ జైల్లో గురువారం ఉదయం 6.45 నిమషాలకు అతన్ని ఉరి తీసిన తర్వాత నాగపూర్ నుంచి ఈ మధ్యాహ్నం మెమన్ భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో ముంబయికి తరలించారు. అనంతరం అతని మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మరోవైపు మెమన్‌కు శ్రద్ధాంజలి ఘటించడానికి పెద్ద సంఖ్యలో ముస్లింలు ఆయన నివాసానికి తరలివచ్చారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. అయితే ఎటువంటి నినాదాలు చేయవద్దని పోలీసులు వారికి సూచించడంతో అంత్యక్రియల కార్యక్రమమంతా సజావుగా పూర్తయ్యింది. మెమన్ నివాసం వద్ద పెద్ద ఎత్తున బలగాలను మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్టు చేశారు.