జర నవ్వండి ప్లీజ్ 159
బస్సు పందెం నాన్నా గుర్రాలు వేగంగా పరిగెడతాయా? బస్సులు వేగంగా వెళతాయా?” “బస్సులే వెళతాయి” “మరి నువ్వు బస్సుల మీద కాయకుండా గుర్రాల మీద పందెమెందుకు కాస్తావు?” ———————————————————— రుణం… రూపం పేషెంట్: డాక్టర్ గారూ! మీరు దయతో నా ఆరోగ్యం బాగుపరిచారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను? డాక్టర్: దాందేముంది? చెక్కుద్వారా, లేదా మనియార్డర్ ద్వారా లేదా క్యాష్ ఇచ్చినా ఫరవాలేదు. ———————————————————— దొంగ…దొంగ “ఏమండీ! మన పని మనిషి రెండు టవల్స్ దొంగిలించింది”. “ఏ […]
బస్సు పందెం
నాన్నా గుర్రాలు వేగంగా పరిగెడతాయా? బస్సులు వేగంగా వెళతాయా?”
“బస్సులే వెళతాయి”
“మరి నువ్వు బస్సుల మీద కాయకుండా గుర్రాల మీద పందెమెందుకు కాస్తావు?”
————————————————————
రుణం… రూపం
పేషెంట్: డాక్టర్ గారూ! మీరు దయతో నా ఆరోగ్యం బాగుపరిచారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను?
డాక్టర్: దాందేముంది? చెక్కుద్వారా, లేదా మనియార్డర్ ద్వారా లేదా క్యాష్ ఇచ్చినా ఫరవాలేదు.
————————————————————
దొంగ…దొంగ
“ఏమండీ! మన పని మనిషి రెండు టవల్స్ దొంగిలించింది”.
“ఏ రంగువి?”
“ఒకటి తెల్లది. రెండోది మనం హోటల్‌నించి ఎత్తుకొచ్చేసిన నీలం రంగుది”.
————————————————————
బుర్రలేని బంధువు
“కృష్ణారావ్! అతను నీ బంధువని, కావాలంటే ఆ విషయాన్ని ఆధారాల్తో సహా నిరూపించగలనని అంటున్నాడు. నువ్వేమంటావు?”
“ఆ మనిషి బుర్రలేనివాడు”
“అతను నీ బంధువనడానికి ఇంతకన్నా ఆధారం ఏం కావాలి?”