మళ్ళీ కాంగ్రెస్ గూటికి జగ్గారెడ్డి
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మళ్ళీ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్‌లోనే ఉన్న ఆయన మధ్యలో భారతీయ జనతాపార్టీలో చేరారు. మెదక్ నుంచి ఆయన ఉప ఎన్నికలో కూడా పోటీ చేశారు. అయితే ఆ పార్టీలో పెద్ద ప్రాధాన్యత లభించక పోవడం, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేయాలంటూ మిత్రులు ఆహ్వానించడంతో ఆయన మళ్ళీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. గురువారం ఆయన కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని వీడి వెళ్ళినందుకు […]
BY sarvi30 July 2015 8:55 AM IST
X
sarvi Updated On: 30 July 2015 8:55 AM IST
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మళ్ళీ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్‌లోనే ఉన్న ఆయన మధ్యలో భారతీయ జనతాపార్టీలో చేరారు. మెదక్ నుంచి ఆయన ఉప ఎన్నికలో కూడా పోటీ చేశారు. అయితే ఆ పార్టీలో పెద్ద ప్రాధాన్యత లభించక పోవడం, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేయాలంటూ మిత్రులు ఆహ్వానించడంతో ఆయన మళ్ళీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. గురువారం ఆయన కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని వీడి వెళ్ళినందుకు తానెంతో బాధ పడుతున్నానని, ఈ విషయమై అధ్యక్షురాలు సోనియాగాంధీకి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. బీజేపీలో చేరడం చారిత్రక తప్పిదంగా ఆయన ప్రకటించారు. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ప్రజాస్వామ్యబద్దంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను అడ్డుకుంటానని ఆయన ప్రకటించారు. కేసీఆర్ పాలనంతా కుటుంబం చుట్టూ నడుస్తుందని, ఆయన ప్రకటనలకే పరిమితమవుతూ పారిపాలన గాలికొదిలేశారని జగ్గారెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు. దిగ్విజయ్‌సింగ్ మాట్లాడుతూ కేసీఆర్ పాలన నిజాం ను తలపిస్తోందని అన్నారు. జగ్గారెడ్డిని చేర్చుకోవడం తమకు ఆభ్యంతరం లేదని మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు చెప్పారని ఆయన తెలిపారు.
Next Story