కాల్‌డేటా హైకోర్టుకు అందించాలని ఆదేశం
ఫోన్ ట్యాపింగ్ కేసులో బెజవాడ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. తుది తీర్పు వచ్చే వరకు ఈ స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. సర్వీస్ ప్రొవైడర్లు కాల్‌డేటాను బెజవాడ కోర్టుకు వారం రోజుల్లోగా అందజేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కాల్‌డేటా ను ప్రత్యేక మెసెంజర్ ద్వారా హైకోర్టు రిజిస్ట్రార్‌కు సమర్పించాలని తీర్పు ఇచ్చింది. ఈ కేసుపై గురువారం ఉదయం హైకోర్టులో హాట్‌హాట్‌గా వాదనలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ వాదించగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున […]
BY sarvi30 July 2015 11:42 AM IST
X
sarvi Updated On: 30 July 2015 12:06 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో బెజవాడ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. తుది తీర్పు వచ్చే వరకు ఈ స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. సర్వీస్ ప్రొవైడర్లు కాల్‌డేటాను బెజవాడ కోర్టుకు వారం రోజుల్లోగా అందజేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కాల్‌డేటా ను ప్రత్యేక మెసెంజర్ ద్వారా హైకోర్టు రిజిస్ట్రార్‌కు సమర్పించాలని తీర్పు ఇచ్చింది. ఈ కేసుపై గురువారం ఉదయం హైకోర్టులో హాట్‌హాట్‌గా వాదనలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ వాదించగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ తన వాదనలు వినిపించారు. రాం జెఠ్మలానీ తన వాదనలు వినిపిస్తూ తెలంగాణ సర్కారు ఫోన్ ట్యాపింగ్ చేసిందని కోర్టుకు తెలిపారు. ఓటుకు నోటు కేసు నమోదైన తర్వాత ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన పరిస్థితి కలిగిందని, అలా చేసే హక్కు తెలంగాణ ప్రభుత్వానికి ఉందని ఆయన వాదించారు. టీడీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆయన కోర్టులో న్యాయమూర్తి ఎదుట అంగీకరించారు. ట్యాపింగ్ చేయాల్సిందిగా సర్వీస్ ప్రొవైడర్లకు హోంశాఖ కార్యదర్శి లేఖలు రాశారని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ చేయించడం రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కుల్లో జోక్యం చేసుకోవడమేనని, ఇలా చేయడం న్యాయ సమ్మతం కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అదనపు సొలిసెటర్ జనరల్ నటరాజన్ వాదించారు. దేశ భద్రతకు ముప్పు ఏర్పడినప్పుడు మాత్రమే అసాంఘీక శక్తుల ఫోన్‌లను ట్యాపింగ్ చేసే అవకాశం ఉంటుందని ఆయన కోర్టుకు స్పష్టం చేశారు. దీనికి కూడా రాష్ట్ర, కేంద్ర హోంశాఖ కార్యదర్శుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవలసి ఉంటుందని నటరాజన్ వాదించారు. రాజకీయనేతలు, ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగేలా ఫోన్ ట్యాపింగ్ చేయడం ప్రయివేటు వ్యక్తుల కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడమేనని, ఇలా చేసే అధికారం ఎవరికీ లేదని సొలిసిటర్ జనరల్ వాదించారు. ఉదయం ఉభయ వర్గాల వాదనలు విన్న కోర్టు కాల్‌డేటా మొత్రాన్ని ఓ ప్రత్యేక మెసెంజర్ ద్వారా హైకోర్టుకు అందించాలని సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.
Next Story