ప్రభుత్వ డ్రైవింగ్ స్కూళ్లు
నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతోపాటు డ్రైవింగ్ లోపాలపై కూడా దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సాయంతో ప్రభుత్వ డ్రైవింగ్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన సంస్థల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ. 25 కోట్లో ఐడీటీఆర్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. అలాంటి కేంద్రాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ప్రతి జిల్లా కేంద్రంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో రూ. 10 […]
BY admin29 July 2015 6:35 PM IST
admin Updated On: 30 July 2015 7:24 AM IST
నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతోపాటు డ్రైవింగ్ లోపాలపై కూడా దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సాయంతో ప్రభుత్వ డ్రైవింగ్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన సంస్థల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ. 25 కోట్లో ఐడీటీఆర్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. అలాంటి కేంద్రాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ప్రతి జిల్లా కేంద్రంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో రూ. 10 కోట్లతో వీటిని ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. దీంతో మొదటి దశలో హైదరాబాద్‌తోపాటు మరో మూడు జిల్లాల్లో ఐడీటీఆర్‌లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ స్కూళ్లలో నామమాత్రపు ఫీజుతో డ్రైవింగ్ నేర్పుతారు.
Next Story