జనం పల్స్ తెలసి చంద్రబాబుకు చెమటలు!
చేపడుతున్న సంక్షేమ పథకాలకు పేరు రావడంలేదు… మంత్రి మండలి సభ్యుల పనితీరు ఏమాత్రం బాగోలేదు… ఎంతో చేస్తున్నా ఏమీ చేయడం లేదనే భావన జనంలో ప్రబలి పోతోంది… ఏమిటీ పరిష్కారం… ఏం చేస్తే పార్టీ, ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది… ఈ ప్రశ్నలే ఇపుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనను తాను వేసుకుని బెంబేలెత్తిపోతున్నారట. అందుకే హడావుడిగా శుక్రవారం విజయవాడలో పోలిట్‌బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నాయకులతో మాటామంతీ కార్యక్రమం ఏర్పాటు […]
చేపడుతున్న సంక్షేమ పథకాలకు పేరు రావడంలేదు… మంత్రి మండలి సభ్యుల పనితీరు ఏమాత్రం బాగోలేదు… ఎంతో చేస్తున్నా ఏమీ చేయడం లేదనే భావన జనంలో ప్రబలి పోతోంది… ఏమిటీ పరిష్కారం… ఏం చేస్తే పార్టీ, ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది… ఈ ప్రశ్నలే ఇపుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనను తాను వేసుకుని బెంబేలెత్తిపోతున్నారట. అందుకే హడావుడిగా శుక్రవారం విజయవాడలో పోలిట్‌బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నాయకులతో మాటామంతీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి. ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ఏ విధంగా జనంలోకి తీసుకువెళ్ళి ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింప జేయాలన్న దానిపై దిశానిర్దేశం చేస్తారట.
రెండు నెలల క్రితం చంద్రబాబు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఓ సర్వే చేయించారు. ఇందులో లక్ష మందిని ఇన్‌వాల్వ్ చేశారు. మెజారిటీ సభ్యులు ప్రభుత్వ పనితీరుపై చాలా అసంతృప్తి వెళ్ళగక్కారు. మరో విషయం ఏమిటంటే… ఇసుక రీచ్‌లను సెల్ప్‌హెల్ప్ గ్రూపులకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. రైతులు కూడా ఏ మాత్రం సంతృప్తికరంగా లేరు. ఇక డ్వాక్రా రుణాల మాఫీపై మహిళలు ప్రభుత్వంపై ఒంటికాలిపై లేస్తున్నారు. చేసిన వాగ్దానాలకు అమలు చేస్తున్న తీరుకు ఏ మాత్రం పొంతన లేకపోవడాన్ని వారు నిలదీశారు. ప్రభుత్వానికి ఎక్కడైనా ఒక పాజిటివ్ మార్కు లభించిందంటే… అది ఒక్క పింఛన్ల పంపిణీ అంశంలోనే. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లు ఒక్కటే సమయానికి అందుతున్నట్టు అభిప్రాయపడ్డారు.
ప్రజలకి-ప్రభుత్వానికి ఉన్న అంతరాన్ని తొలగించడంలో అటు పార్టీగాని, ఇటు ప్రభుత్వ ప్రతినిధులుగాని ఏమాత్రం పనికిరావడం లేదన్నది చంద్రబాబు మనోగతం. మంత్రుల పనితీరు మీద కూడా సర్వేలో నెగిటివ్ మార్కులే పడడం బాబుకు ఆగ్రహాన్ని కలిగిస్తోంది. నిజానికి కొందరు మంత్రుల పనితీరు ఏ మాత్రం బాగోలేదని కేబినెట్ సమావేశాల్లో చంద్రబాబే స్వయంగా ప్రస్తావించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉన్న అంతరాన్ని తొలగించడంలో సీనియర్ నాయకులు ప్రయత్నించడం లేదన్నది బాబు అభిప్రాయం. అలాగే మంత్రులు కూడా కామన్‌మెన్‌కి అందుబాటులో ఉండడం లేదన్న అంశం కూడా సర్వేలో ప్రముఖంగా రికార్డయ్యింది. పార్టీలోను, ప్రభుత్వంలోను ఉన్న అవలక్షణాలన్నీ ఎలా తొలగించాలా అని చంద్రబాబు మధనపడుతున్నట్టు ఓ నాయకుడి కథనం. అయితే మంత్రులపని, అధికారులపని అందరిపని తానే చేస్తూ ఫెయిల్‌అయి ఇప్పుడు మంత్రులమీద, అధికారులమీద నెపం వెయ్యాలనిచూస్తే ప్రయోజనం ఏమిటని పార్టీ అభిమానులు చంద్రబాబుని ప్రశ్నిస్తున్నారు.