Telugu Global
Others

అప్పుడు షేక్స్‌స్పియ‌ర్‌.. ఇప్పుడు యాకూబ్ మెమ‌న్

అస‌లు వీళ్ల‌ద్ద‌రికీ పోలిక ఏమిట‌ని ఆశ్చ‌ర్యంగా ఉందా? మీలో కొంద‌రికి కోపంగా కూడా ఉందా! స‌హ‌జం! కానీ కార‌ణాలు ఏవైనా..నేప‌థ్యాలు ఏమైనా..ఇద్ద‌రి మ‌ధ్యా శ‌తాబ్దాల అంత‌రం ఉన్నా..షేక్స్‌స్పియ‌ర్‌-యాకూబ్ మెమ‌న్ మ‌ధ్య ఒక పోలిక ఉంది. అదే పుట్టిన రోజునే మ‌ర‌ణించ‌డం! ఆంగ్ల సాహిత్యంలో త‌న పేరును సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించుకున్న‌ షేక్స్‌స్పియర్ ఏప్రిల్ 23, 1564లో పుట్టారు. 1616లో మ‌ళ్లీ స‌రిగ్గా ఏప్రిల్ 23నే మ‌ర‌ణించారు. ప్ర‌పంచంలో పుట్టిన‌రోజునే మ‌ర‌ణించిన మ‌హ‌నీయుడుగా షేక్స్‌స్పియ‌ర్‌ని కీర్తిస్తారు. ఇంకా చాలామంది ప్ర‌పంచంలో […]

అప్పుడు షేక్స్‌స్పియ‌ర్‌.. ఇప్పుడు యాకూబ్ మెమ‌న్
X

అస‌లు వీళ్ల‌ద్ద‌రికీ పోలిక ఏమిట‌ని ఆశ్చ‌ర్యంగా ఉందా? మీలో కొంద‌రికి కోపంగా కూడా ఉందా! స‌హ‌జం!
కానీ కార‌ణాలు ఏవైనా..నేప‌థ్యాలు ఏమైనా..ఇద్ద‌రి మ‌ధ్యా శ‌తాబ్దాల అంత‌రం ఉన్నా..షేక్స్‌స్పియ‌ర్‌-యాకూబ్ మెమ‌న్ మ‌ధ్య ఒక పోలిక ఉంది. అదే పుట్టిన రోజునే మ‌ర‌ణించ‌డం!
ఆంగ్ల సాహిత్యంలో త‌న పేరును సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించుకున్న‌ షేక్స్‌స్పియర్ ఏప్రిల్ 23, 1564లో పుట్టారు.
1616లో మ‌ళ్లీ స‌రిగ్గా ఏప్రిల్ 23నే మ‌ర‌ణించారు. ప్ర‌పంచంలో పుట్టిన‌రోజునే మ‌ర‌ణించిన మ‌హ‌నీయుడుగా షేక్స్‌స్పియ‌ర్‌ని కీర్తిస్తారు. ఇంకా చాలామంది ప్ర‌పంచంలో ఇలాగా మ‌ర‌ణించివుండొచ్చు. కానీ ప్ర‌పంచ‌మంత‌టికీ తెలిసిన వ్య‌క్తి మాత్రం షేక్స్‌స్పియరే!
ఇక యాకుబ్ మెమ‌న్ విష‌యానికివ‌స్తే, 13 వ‌రుస పేలుళ్ల‌తో ముంబై చ‌రిత్ర‌లో ర‌క్త‌పు మ‌ర‌క‌ను మిగిల్చిన కుట్ర‌దారుల్లో ఒక‌రు! దోషిగా తేలి జులై 30న మ‌ర‌ణ‌దండ‌న అనుభ‌వించారు. ఆయ‌న 1962 జులై 30న పుట్టారు. భూమ్మీద పురుడుపోసుకున్న‌రోజునే తుదిశ్వాస విడిచిన వ్య‌క్తిగా నిలిచిపోయారు. షేక్స్‌స్పియ‌ర్ త‌ర్వాత పుట్టిన‌రోజునే మ‌ర‌ణించిన అంద‌రికీ తెలిసిన మ‌నిషి బ‌హుశా యాకూబ్ మెమ‌న్ కావొచ్చు! పోలిక ఇబ్బందిగా ఉన్నా జ‌న‌న‌మ‌ర‌ణాల‌ను అంగీక‌రించాల్సిందేక‌దా!

First Published:  29 July 2015 6:35 PM IST
Next Story