జగన్ హెచ్చరికలతో రైతు కుటుంబాలకు పరిహారం
వైసీపీ అధినేత జగన్ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వకుంటే న్యాయపోరాటం చేస్తానని, తాను అధికారంలోకి వస్తే రూ. 5 లక్షలు చెల్లిస్తానని జగన్ హెచ్చరించడంతో హడావుడిగా 33 రైతు కుటుంబాలకు పరిహారం పంపిణీ చేసింది. తొమ్మిది నెలలుగా కలెక్టర్ పంపుతున్న ప్రతిపాదనలను ఖాతరు చేయని ప్రభుత్వం ప్రతిపక్షనేత హెచ్చరికలతో ఒక్కో రైతు కుటుంబానికి రూ.1.50 లక్షల చొప్పున 33 కుటుంబాలకు రూ.49.50 లక్షల పరిహారాన్ని చెల్లిస్తూ బుధవారం ఉత్తర్వులు […]
BY admin29 July 2015 6:47 PM IST
admin Updated On: 30 July 2015 8:26 AM IST
వైసీపీ అధినేత జగన్ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వకుంటే న్యాయపోరాటం చేస్తానని, తాను అధికారంలోకి వస్తే రూ. 5 లక్షలు చెల్లిస్తానని జగన్ హెచ్చరించడంతో హడావుడిగా 33 రైతు కుటుంబాలకు పరిహారం పంపిణీ చేసింది. తొమ్మిది నెలలుగా కలెక్టర్ పంపుతున్న ప్రతిపాదనలను ఖాతరు చేయని ప్రభుత్వం ప్రతిపక్షనేత హెచ్చరికలతో ఒక్కో రైతు కుటుంబానికి రూ.1.50 లక్షల చొప్పున 33 కుటుంబాలకు రూ.49.50 లక్షల పరిహారాన్ని చెల్లిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.5 లక్షలు చెల్లిస్తానని ప్రకటించిన ప్రభుత్వం రూ.1.50 లక్షలే ఇవ్వడం పట్ల రైతు కుటుంబాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
Next Story