పోలీస్ పరీక్షల్లో 5 కిలోమీటర్ల పరుగు రద్దు
ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో 5 కిమీ పరుగు పందాన్ని రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అధికారిక ఉత్తర్వులను ఒకట్రెండు రోజుల్లో విడుదల చేయనుంది. ఈ పరీక్షలో పాల్గొన్న అభ్యర్ధుల మరణాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, దీని స్థానంలో మొదట రాత పరీక్షను నిర్వహించి, ఆ తర్వాత ఫిజికల్ టెస్టులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ప్రకటించిన జాబితాలో పోలీస్ శాఖలోనే 9 వేలకు పైగా పోస్టులుండడం, అభ్యర్ధులకు పరుగు […]
BY admin29 July 2015 6:45 PM IST
admin Updated On: 30 July 2015 7:29 AM IST
ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో 5 కిమీ పరుగు పందాన్ని రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అధికారిక ఉత్తర్వులను ఒకట్రెండు రోజుల్లో విడుదల చేయనుంది. ఈ పరీక్షలో పాల్గొన్న అభ్యర్ధుల మరణాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, దీని స్థానంలో మొదట రాత పరీక్షను నిర్వహించి, ఆ తర్వాత ఫిజికల్ టెస్టులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ప్రకటించిన జాబితాలో పోలీస్ శాఖలోనే 9 వేలకు పైగా పోస్టులుండడం, అభ్యర్ధులకు పరుగు పందాన్ని రద్దు చేయడంతో పోలీస్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Next Story