తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు లేకపోయినా అనాథలే
తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు లేకపోయినా వారి పిల్లలను అనాధలుగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 18 సంవత్సరాలు నిండే వరకు వారి బరువు, బాధ్యతలను ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఈ మేరకు అనాధ పిల్లల గుర్తింపు కోసం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం అనాథలను ఎలా గుర్తించాలన్న దానిపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రుల నిరాదరణకు గురైన వారిని కూడా అనాధులుగా గుర్తించాలా? లేక తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు లేకపోయిన వారిని […]
BY Pragnadhar Reddy29 July 2015 1:32 AM IST
X
Pragnadhar Reddy Updated On: 29 July 2015 1:32 AM IST
తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు లేకపోయినా వారి పిల్లలను అనాధలుగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 18 సంవత్సరాలు నిండే వరకు వారి బరువు, బాధ్యతలను ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఈ మేరకు అనాధ పిల్లల గుర్తింపు కోసం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం అనాథలను ఎలా గుర్తించాలన్న దానిపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రుల నిరాదరణకు గురైన వారిని కూడా అనాధులుగా గుర్తించాలా? లేక తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు లేకపోయిన వారిని అనాధలుగా గుర్తించాలన్న దానిపై మంత్రివర్గ ఉప సంఘం తర్జన భర్జన పడినట్టు తెలిసింది. తల్లిదండ్రులు లేని పిల్లలు, తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు లేకపోయినా… వారిని అనాధలుగా గుర్తించాలని నిర్ధారణకు వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో సర్వే నిర్వహించి అనాధ పిల్లలను గుర్తించనుంది. అనాధలను ఆదుకోవడం కోసం పారిశ్రామికవేత్తల నుండి భారీగా విరాళాలు సేకరించాలని సమావేశంలో నిర్ణయించారు. ఆగస్టు మూడున మంత్రివర్గ ఉపసంఘం మరో సమావేశం ఏర్పాటు చేసి అనాధలను గుర్తించడానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాలని నిర్ణయించింది.
Next Story