Telugu Global
NEWS

వైఎస్‌ చిత్రపటం తొలగింపు చెడు సంప్రదాయం: కేవీపీ

రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా ప్రజలకు విశేష సేవలందించిన వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని అసెంబ్లీ నుంచి తొలగించడం చెడు సంప్రదాయాలకు బీజం వేసినట్టేనని పార్లమెంట్‌సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. వైఎస్‌ చిత్రపటం తొలగింపునకు సంబంధించి ఏపీ శాసనసభా స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌కు ఓ లేఖ రాస్తూ తొలగించిన చిత్రపటాన్ని యథాస్థానంలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కేవీపీ కోరారు. ఇటీవల అసెంబ్లీ ఇన్‌ఛార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ దగ్గరుండి మరీ సిబ్బందితో వైఎస్‌ చిత్రపటాన్ని తీయించి వేశారని, స్పీకర్‌ […]

వైఎస్‌ చిత్రపటం తొలగింపు చెడు సంప్రదాయం: కేవీపీ
X
రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా ప్రజలకు విశేష సేవలందించిన వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని అసెంబ్లీ నుంచి తొలగించడం చెడు సంప్రదాయాలకు బీజం వేసినట్టేనని పార్లమెంట్‌సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. వైఎస్‌ చిత్రపటం తొలగింపునకు సంబంధించి ఏపీ శాసనసభా స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌కు ఓ లేఖ రాస్తూ తొలగించిన చిత్రపటాన్ని యథాస్థానంలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కేవీపీ కోరారు. ఇటీవల అసెంబ్లీ ఇన్‌ఛార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ దగ్గరుండి మరీ సిబ్బందితో వైఎస్‌ చిత్రపటాన్ని తీయించి వేశారని, స్పీకర్‌ అనుమతి లేకుండా సభా ప్రాంగణంలో చిత్రపటాన్ని ఎవరూ తాకరాదన్న విషయాన్ని ఆయన దృష్టికి తెస్తే, శాసనసభాపతి అనుమతితోనే దాన్ని తొలగిస్తున్నట్టు చెప్పారని కేవీపీ తన లేఖలో ప్రస్తావించారు. విగ్రహాలు, చిత్రపటాలు తొలగించడం చెడు సంప్రదాయమని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌ విడిపోయిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైఎస్‌ నిలువెత్తు ఫొటో ఉన్న ప్రాంతాన్ని ఏపీకి కేటాయించారు. అక్కడ పలుసార్లు తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష సమావేశాలు నిర్వహించారు. ఇలాంటి సమయంలో వైఎస్‌ చిత్రపటంపై ముసుగు వేసేవారు. ఇపుడు ఏకంగా ఆ ఫొటోనే అక్కడి నుంచి తొలగించారు.
First Published:  29 July 2015 1:14 AM GMT
Next Story