Telugu Global
Others

సుజ‌నా చౌద‌రి రూ. 100 కోట్లు చెల్లించాల్సిందే: హైకోర్టు 

కేంద్ర స‌హాయ మంత్రి సుజ‌నాచౌద‌రికి మంగ‌ళ‌వారం హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. మారిష‌స్ సంస్థ‌కు రూ. 100 కోట్లను చెల్లించాల‌ని గ‌తంలో సింగిల్ జ‌డ్జి ఇచ్చిన తీర్పును కొట్టి వేయాల్సిందిగా సుజ‌నా హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్‌ను విచారించిన ధ‌ర్మాస‌నం సింగ‌ల్ జడ్జి తీర్పును స‌మ‌ర్ధించింది. సుజ‌నా చౌద‌రి మారిష‌స్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకు నుంచి తీసుకున్న రూ. 100 కోట్ల‌ను సెప్టెంబ‌రు 30 లోగా  చెల్లించాల‌ని ఆదేశించింది. మారిష‌స్‌లోని సుజనా చౌద‌రికి చెందిన అనుబంధ సంస్థ హెస్టియా కంపెనీ […]

కేంద్ర స‌హాయ మంత్రి సుజ‌నాచౌద‌రికి మంగ‌ళ‌వారం హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. మారిష‌స్ సంస్థ‌కు రూ. 100 కోట్లను చెల్లించాల‌ని గ‌తంలో సింగిల్ జ‌డ్జి ఇచ్చిన తీర్పును కొట్టి వేయాల్సిందిగా సుజ‌నా హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్‌ను విచారించిన ధ‌ర్మాస‌నం సింగ‌ల్ జడ్జి తీర్పును స‌మ‌ర్ధించింది. సుజ‌నా చౌద‌రి మారిష‌స్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకు నుంచి తీసుకున్న రూ. 100 కోట్ల‌ను సెప్టెంబ‌రు 30 లోగా చెల్లించాల‌ని ఆదేశించింది. మారిష‌స్‌లోని సుజనా చౌద‌రికి చెందిన అనుబంధ సంస్థ హెస్టియా కంపెనీ లిమిటెడ్ మారిష‌స్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకు నుంచి రూ.100 కోట్లు రుణం తీసుకుంది. ఆ రుణానికి సుజ‌నా ఇండ‌స్ట్రీస్ గ్యారంటీ ఇచ్చింది. రుణాన్ని హెస్టియా కంపెనీ చెల్లించ‌క పోవ‌డంతో మారిష‌స్ బ్యాంకు సుజ‌నా ఇండ‌స్ట్రీస్ పై హైకోర్టులో దావా వేసింది. ఈ కేసులో సుజనాకు చుక్కెదురయ్యింది.
First Published:  28 July 2015 6:37 PM IST
Next Story