ఐదుగురు ఐఏఎస్‌లతో అమరావతిపై మరో కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాజధానికి ప్రభుత్వ కార్యాలయాలను వేగంగా తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం పురపాలక శాఖ కార్యదర్శి కరికాల వలవన్ కన్వీనర్‌గా, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ , ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి హేమ మునివెంకటప్ప, రహదారులు, భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్యాం బాబులను సభ్యులుగా చేసి ఒక కమిటీని నియమించింది. ఈ ఐదుగురు సభ్యుల ఐఏఎస్‌ల బృందం నూతన రాజధాని సీఆర్డీఏ పరిధిలోని […]
BY sarvi28 July 2015 6:39 PM IST
sarvi Updated On: 29 July 2015 5:14 AM IST
ఆంధ్రప్రదేశ్ రాజధానికి ప్రభుత్వ కార్యాలయాలను వేగంగా తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం పురపాలక శాఖ కార్యదర్శి కరికాల వలవన్ కన్వీనర్‌గా, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ , ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి హేమ మునివెంకటప్ప, రహదారులు, భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్యాం బాబులను సభ్యులుగా చేసి ఒక కమిటీని నియమించింది. ఈ ఐదుగురు సభ్యుల ఐఏఎస్‌ల బృందం నూతన రాజధాని సీఆర్డీఏ పరిధిలోని గుంటూరు, విజయవాడ నగరాల్లో ప్రభుత్వ కార్యాలయాలను తరలించేందుకు తాత్కాలిక ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గుంటూరు, విజయవాడ కలెక్టర్లు వీరికి సహకరించాలని సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Next Story